CM Revanth Reddy ( image credit: swetcha reporter)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

CM Revanth Reddy: నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక

CM Revanth Reddy: గ్రేటర్ వరంగల్ లో నాలాల కబ్జాలను ఉపేక్షించేది లేదు అక్రమ కట్టడాలను తొలగించాల్సిందే.. ఆక్రమణకు పాలపడ్డవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందే అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ల్ భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లతో కలసి రాష్ట్రస్థాయి అధికారులు, 12 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read: CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం

సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోండి. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వండి. తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది అని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలీ. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం వద్దన్నారు.

రూ. 5 లక్షలు పరిహారం

కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకుంటుంది. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. ఇందుకు సంబధించి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలి. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు వేయండి.

ఇండ్లు మునిగిన వారికి రూ.15 వేల సాయం

ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయండి. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి.మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి సీఎం ఆదేశించారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయండి.
ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలి. వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వదలండి క్షేత్రస్థాయికి వెళ్లండి, కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే అని సీఎం ఆదేశించారు.

Also ReadCM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు