Visa Free Countries: సాధారణంగా విదేశాల్లో పర్యటించాలంటే వీసా తప్పనిసరి. అది లేకుంటే ఆయా దేశాలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయులను అనుమతించవు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఎలాంటి వీసా అవసరం లేకుండానే భారతీయులకు ఆహ్వానం పలుకుతున్నాయి. నిర్ధిష్టం కాలం వరకూ తమదేశంలో విహరించేందుకు అనుమతి ఇస్తున్నాయి. అయితే వాటిలో ప్రకృతి అందాలు, బీచ్ లు, కొండ ప్రాంతాలకు కేరాఫ్ గా ఉన్న ఒక ఏడు చిన్న దేశాలను ఈ కథనంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటిపై లుక్కేయండి.
1. మాల్దీవులు (Maldives)
అత్యంత సుందరమైన పర్యాటక దేశాల్లో మాల్దీవులు ఒకటి. ఇక్కడ వెయ్యికి పైగా చిన్న చిన్న దీవులు ఉన్నాయి. అందమైన బీచ్ లలో సరదాగా గడపాలని భావించేవారికి మాల్దీవులు బెస్ట్ ఛాయిస్. నవంబర్ – ఏప్రిల్ (సముద్రం ప్రశాంతంగా ఉంటుంది) మధ్య మాల్దీవులు వెళ్లడం మంచిది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు మాల్దీవులు ట్రిప్ ను ఆఫర్ చేస్తున్నాయి.
2. భూటాన్ (Bhutan)
భారత్ కు సమీపంలోని అందమైన దేశాల్లో భూటాన్ ఒకటి. ఎత్తైన కొండల నడుమ ఉండే ఈ దేశం.. పర్వతారోహణను ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్. ఇక్కడి టైగర్ నెస్ట్ మఠం ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. మార్చి – మే , సెప్టెంబర్ – నవంబర్ మధ్య భూటాన్ దేశాన్ని సందర్శిస్తే మంచి అనుభూతి పొందవచ్చు. ఆ సమయంలో భూటాన్ కొండల్లోని చెట్లు పూలతో చాలా అందంగా దర్శనమిస్తాయి.
3. నేపాల్ (Nepal)
హిమాలయ పర్వతాలు, పశుపతినాథ్ ఆలయం, పోఖరా సరస్సుతో.. నేపాల్ పర్యాటకంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఈ దేశానికి వెళ్లడానికి భారతీయులకు పాస్ పోర్ట్ అవసరం లేదు. అయితే ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేపాల్ కు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత నేపాల్ ను తప్పక వీక్షించవచ్చు. అక్టోబర్ – డిసెంబర్ మధ్య నేపాల్ ట్రిప్ ను ప్లాన్ చేసుకోవచ్చు.
4. డొమినికా (Dominica)
“నేచర్ ఐలాండ్” అనే బిరుదు గల ఈ దేశం పచ్చని అడవులు, అగ్నిపర్వతాలు, హాట్ స్ప్రింగ్స్, జలపాతాలతో నిండి ఉంది. ఇక్కడ చూడాల్సిన అతి ముఖ్యమైన వాటిలో బోయిలింగ్ లేక్ (ప్రపంచంలో రెండో పెద్ద సరస్సు) ఒకటి. డిసెంబర్ – ఏప్రిల్ మధ్య డొమినికాను సందర్శించవచ్చు.
5. సెయింట్ విన్సెంట్ & గ్రెనడైన్స్ (Saint Vincent And The Grenadines)
30కి పైగా దీవులున్న ఈ కరీబియన్ దేశం.. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమా ఇక్కడే షూట్ అయింది. డిసెంబర్ – ఏప్రిల్ మధ్య బెస్ట్ టైమ్ గా చెప్పవచ్చు.
6. నియూ (Niue)
చాలా చిన్న విస్తీర్ణం కలిగిన ఈ నియూ దేశం.. లైమ్‌స్టోన్ గుహలు, కోరల్ రీఫ్‌లు, హంప్‌బ్యాక్ తిమింగలాలతో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. మే – అక్టోబర్ లో ఇక్కడ పర్యటించడం ఉత్తమం. ఒక స్కూటర్ అద్దెకు తీసుకొని స్వేచ్ఛగా తిరగొచ్చు.
7. మైక్రోనేశియా (Micronesia)
600కి పైగా దీవులు కలిగిన ఈ దేశం సముద్ర ప్రేమికులకు తప్పక నచ్చుతుంది. ఇక్కడి నాన్ మాడోల్ నగరం అత్యంత ప్రాచీనమైనదిగా గుర్తింపు పొందింది. స్కూబా డైవింగ్ లకు ఈ దేశం బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. మే – అక్టోబర్ (నీటి లోపల మంచి విజిబిలిటీ ఉంటుంది) మధ్య ఈ దేశాన్ని దర్శించవచ్చు.
Also Read: Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య
భారతీయులకు టిప్స్..
పైన పేర్కొన్న చాలా వరకూ దేశాలకు సింగపూర్, దుబాయి, దోహా ద్వారా కనెక్టివిటీ ఉంది. నియూ, మైక్రోనేశియా కోసం మాత్రం విమాన సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక డబ్బు విషయానికి వస్తే.. భూటాన్, డొమినికా, నియూ దేశాల్లో నగదు ఎక్కువగా వాడతారు. కాబట్టి యూఎస్ డాలర్లు తీసుకెళ్తే మంచిది. అలాగే 6 నెలల వాలిడిటీ కలిగిన పాస్ పోర్ట్ కూడా వెంట తీసుకెళ్లాలి. మెడికల్ కిట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పక ఉంచుకోండి. Wi-Fi కొన్నిచోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు. స్థానిక సిమ్ లేదా ఆఫ్‌లైన్ మ్యాప్స్ వాడాలి. నేపాల్, భూటాన్‌కు వెళ్లాలని భావించేవారు వెచ్చని బట్టలు తీసుకెళ్లండి. దీవులు ఉన్న దేశాలకు వెళ్లేవారు సన్‌స్క్రీన్, స్విమ్ సూట్ ను వెంట తీసుకెళ్తే బెటర్.