Ande Sri: తెలంగాణ ప్రముఖ కవి రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ మరణించారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉదయం స్రృహతప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంభ సభ్యులు హుటాహుడిన గాంధీ ప్రభుత్వ హస్సిటల్‌కి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
తెలంగాణ కవి, ఎన్నోపేరుప్రఖ్యాతలు పొందిన వ్యక్తి మరణించండం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా చూడవచ్చు.. తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయం అయిన జయజయహే తెలంగాణ గేయాన్ని కవి అందెశ్రీ రచించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.
Also Read: Temple hundi fire: కానుకలు వేసే హుండీలో కర్పూరం వేసింది.. ఓ భక్తురాలి అత్యుత్సాహం
1961 జులై 18న సిద్దిపేట జిల్లా ముద్దూరు మండలగ్రామ పరిదిలోని రేపర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఈయన అసలు పేరు ఎల్లయ్య ఈయనకు చదువు రాకపోయిన పట్టుదలతో ఓక్కో అక్షరాన్ని నేర్చుకొని ఓ గొప్ప రచయితగా పేరు పొందిన వ్యక్తి. రచయిత, కవి, గేయ రచయితగా పేరు పొందిన వ్యక్తి. అందెశ్రీకి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. అశువు కవిత్వం చెప్పడంలో ఈయన ప్రసిద్ది చెందిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం(Telangana State Movement)లో కీలక పాత్రపోషించిన వ్యక్తులలో ఈయన ఓకరు. సీనీరంగానికి రచయితగా కూడా సేవలందించారు. 2006 గంగా(Ganga) సినిమాకు గాను ఈయనకు అందెశ్రీకి నంది పురస్కారం అందుకున్నారు. 2014 లో అకాడమీ ఆఫ్ యునివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథీ సాహీతీ పురస్కారం, మరియు 2015 లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. దీంతో పాటుగా కాకతీయ యునివర్సీటీ నుండి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
Also Read: Telangana Winter Season: తెలంగాణలో సడెన్‌గా మారిపోయిన వాతావరణం.. ఈ ఏడాది చలి అంచనా ఇదే
ప్రముఖ రచయిత అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ
ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన ప్రభుత్వం
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ pic.twitter.com/jSOlbxbOEJ— BIG TV Breaking News (@bigtvtelugu) November 10, 2025
