SEBI Warning: ఇప్పటికే ఎన్నో కొత్త యాప్స్ వచ్చాయి. వాటిలో పెట్టుబడులు పెట్టేవి కూడా ఉన్నాయి. అయితే, అన్ని నిజం కావు, కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. తాజాగా డిజిటల్ బంగారం సురక్షితం కాదు అంటూ SEBI కీలక ప్రకటన చేసింది. దీంతో జనాలందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెట్టుబడి మాత్రమే సురక్షితమని అంటున్నారు.
మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. SEBI ఇలా చెబుతోంది.. ఇలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణలో లేవు. అంటే, ఏదైనా సమస్య వస్తే పెట్టుబడిదారులకు చట్టపరమైన రక్షణ లేదా సహాయం లభించదు. కాబట్టి ఇవి ప్రమాదకరమని హెచ్చరించింది.
ఇటీవల చాలా ఆన్‌లైన్ యాప్స్, వెబ్‌సైట్లు “డిజిటల్ గోల్డ్”, “ఈ-గోల్డ్” పేర్లతో బంగారం పెట్టుబడులను సులభంగా చేయవచ్చని ప్రచారం చేస్తున్నాయని SEBI తెలిపింది. కానీ, ఇవి SEBI ఆమోదించిన గోల్డ్ ఉత్పత్తులు కావు. ఇవి సెక్యూరిటీస్‌గా గానీ, కమోడిటీ డెరివేటివ్స్‌గా గానీ గుర్తించబడలేదు. అంటే ఇవి పూర్తిగా SEBI పరిధి వెలుపలే పనిచేస్తున్నాయి.
Also Read: Sharwanand fitness journey: తన ఫిట్‌నెస్ రహస్యం ఏంటో చెప్పిన హీరో శర్వానంద్.. మార్పుకు కారణం అదే..
SEBI సూచన ఏమిటంటే.. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ ETFలు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. ఇవి అధికారికంగా SEBI నియంత్రణలో ఉంటాయి కాబట్టి సురక్షితం. నిపుణులు కూడా చెబుతున్నారు. డిజిటల్ గోల్డ్ ఆఫర్లు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, అవి చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ప్లాట్‌ఫారమ్‌లో పెట్టుబడి పెట్టే ముందు అది నిజంగా నమ్మదగినదేనా అని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
