Konda Vishweshwar Reddy (imagecredit:twitter)
Politics, హైదరాబాద్

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే పక్కా గెలుపు మాదే: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే గెలుపు బీజేపీదేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) ధీమా వ్యక్తంచేశారు. కేవలం తాము మెజారిటీ ఎంత అనేదే చూసుకోవాలన్నారు. ఎందుకంటే వర్షం కురిస్తే.. అంతా జలమయమై కోపంతో తమకు ఓటు వేస్తారని ధీమాతో ఉన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ను మరో ఓల్డ్ సిటీని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్ లో ఖబర్ స్థాన్ పాలిటిక్స్ కు, అభివృద్ధికి మధ్య ఈ ఉప ఎన్నిక జరగుతోందని వ్యాఖ్యానించారు. రూ.60 వేల కోట్లతో తెలంగాణలో రోడ్లు, ఇతరత్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ వాటికి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

చరిత్రలో సీఎం ప్రచారం

రాష్​ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు దాదాపు రూ.2.44 లక్షల కోట్ల అప్పు చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంటే రోజుకు రూ.347 కోట్లు, గంటకు రూ.14.5 కోట్ల అప్పు సర్కార్ చేసిందని పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంత అప్పు తెచ్చి తెలంగాణ(Telangana)లో ఏం అభివృద్ధి చేశాడో ముఖ్​యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ అప్పులతో సర్పంచ్ ల బకాయిలు తీర్చారా? అని ప్రశ్నించారు. లేదంటే ఫీజు రీయింబర్స్ మెంట్ అందించారా? అని నిలదీశారు. ఏదీ చేయకుండా ఆ డబ్బును ఏం చేసినట్లని ప్రశ్నించారు. సీఎం రేవంత్ పూర్తిగా అసత్యాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఏలేటి విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడంలేదని మళ్లీ మళ్లీ విమర్శలు చేస్తున్నారని, ఈ అంశంపై ఎక్కడ చర్చించేందుకు అయినా తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

Also Read: Kunamneni Sambasiva Rao: ఆ రెండు పార్టీలు గెలిస్తే చాలా డేంజర్: ఎమ్మెల్యే కూనంనేని

ఇది కుర్చీ కాపాడుకోవడానికి..

అవినీతి సొమ్ము కక్కిస్తామని చెప్పిన రేవంత్.. ఒక్క రూపాయి అయినా కక్కించారా అని ప్రశ్నించారు. దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చి కుర్చీ కాపాడుకోవాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని చురకలంటించారు. చరిత్రలో ఏ సీఎం ఒక ఉప ఎన్నికకు రాత్రనక, పగలనకా ప్రచారం చేయలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడానికి కాకుంటే దేనికని ఆయన నిలదీశారు. పోస్టు పోతుందని రేవంత్ కు భయం ఉందన్నారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అని ఒక వర్గానికి కాంగ్రెస్ కొమ్ము కాస్తోందన్నారు. గుడి కూల్చి ఖబర్ స్థాన్ కు భూములు ఇస్తున్నారని, అదే గుడికి ఇవ్వమంటే మాత్రం స్థలం ఇవ్వడం లేదన్నారు. రేవంత్ వి డర్టీ పాలిటిక్స్ అని, కేటీఆర్, కిషన్ రెడ్డిని కలిపి డర్టీ బ్రదర్స్ అని విమర్శిస్తున్నారని ఫైరయ్యారు. రేవంత్ కు ఇతర పార్టీ వారితో డర్టీ రిలేషన్స్ ఉన్నాయని ఆరోపించారు. నిజానికి రేవంత్, హరీష్ రావు డర్టీ బ్రదర్స్ అని, కవిత, రేవంత్ పార్ట్ నర్ షిప్ లో కలిసి బిజినెస్ చేయలేదా? అని ఏలేటి ప్రశ్నించారు.

Also Read: Bandi Sanjay: ఆయన తండ్రే ఎం చేయలేక పోయిండు కొడుకు ఎం చేస్తాడు: బండి సంజయ్

Just In

01

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్

Bigg Boss Malayalam Winner: బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 విజేతగా నటి అనుమోల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే పక్కా గెలుపు మాదే: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి