Kunamneni Sambasiva Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Kunamneni Sambasiva Rao: ఆ రెండు పార్టీలు గెలిస్తే చాలా డేంజర్: ఎమ్మెల్యే కూనంనేని

Kunamneni Sambasiva Rao: బీఆర్ ఎస్ గెలిస్తే బీజేపీకి ఉపయోగం జరుగుతుందని, బీజేపీ(BJP) గెలువొద్దనేది తమ లక్ష్యమని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు సొంత వ్యూహం లేదన్నారు. గతంలో కేసులు ఉన్నాయని ఉద్దేశంతో పలు కీలక ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వైఖరిని బీఆర్ఎస్ తీసుకుందన్నారు.

అవసరాన్ని బట్టి..

ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అదే వైఖరిని అవలంబిస్తే సైద్దాంతికంగా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు నిలకడగా లేవని, అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మార్చుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో దేశానికి నష్టం జరుగుతున్నదని, మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ఓట్ చోరీని తిప్పికొట్టాలనికోరారు.

Also Read: Mithramandali OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘మిత్రమండలి’.. కారణం అదేనా..

కమ్యూనిస్టుల ప్రాధాన్యత..

కేంద్రం ఓటర్ల ప్రక్షాళన పేరుతో ప్రజల సార్వత్రిక ఓటింగ్ హక్కుకు భంగం కలిగిస్తున్నదని మండిపడ్డారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ వ్యతిరేకంగా మోడీ(Modhi) ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దేశంలో,ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాధాన్యత నిత్యం పెరుగుతున్నదని, నేపాల్(Nepal) లో 11 కమ్యూనిస్టు పార్టీలు ఒకటయ్యాయని, ఇది భారత్ మంచి సంకేతమని, దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీలంకలో కూడా ప్రజలు వామపక్షాల వైపు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా వామపక్ష కమ్యూనిస్టు జండాలు ఎగురుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారని, కానీ కమ్యూనిజాన్ని రూపుమాపడం ఆయన తరం కాదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ పాల్గొన్నారు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్.. ముస్లిం ఓటర్లను ఆకర్షించేలా స్కెచ్!

Just In

01

Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ

Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ

Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!

Kishan Reddy: అసలు ఆట ఇంకా మొదలవ్వలే.. రానున్న రోజుల్లో మొదలుపెడతాం..!

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధుడు.. రూ.5 లక్షలు వెనక్కి వచ్చేలా చేసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?