TET Notification: గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న వారికి నెల 10 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రక్రియ ఉంటుందని టీజీపీఎస్సీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్సీ.. 1388 గ్రూప్-3 పోస్టులకు 2024 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ర 3 రాత పరీక్ష నిర్వహించింది. పరీక్షకు 2.67 లక్షల మంది హాజరయ్యారు. గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్చి 14న విడుదల చేశారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
ఇటీవల పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా విడుదలైంది. కాగా సోమవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. టీజీపీఎస్సీ సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు స్వీయ ధ్రువీకరణతో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు ఈనెల 27 నుంచి 29 వరకు రిజర్వ్ డేలో హాజరవ్వాలని సూచించారు.
వారంలో టెట్ నోటిఫికేషన్?
టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది. ఈ క్రమంలో టెట్ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందోనని ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో టెట్ పాస్ కాని ఉపాధ్యాయులు సుమారు 45 వేల మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిసెంబరు 12 వరకు సెలవులో ఉన్నారు. ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న శ్రీదేవసేన ఆలోపు నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
Also Read: Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!
