Dangerous Roads India: దేశంలో ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు
Dangerous Roads India (Image Source: Twitter)
Travel News, లేటెస్ట్ న్యూస్

Dangerous Roads India: వణుకు పుట్టించే మార్గాలు.. బండి ఉంటే సరిపోదు.. గట్స్ కూడా ఉండాల్సిందే!

Dangerous Roads India: దేశవ్యాప్తంగా ఎన్నో రహదారులు ఉన్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాలతో నిండి ఉండగా.. మరికొన్ని భయం, ఉత్సాహాన్ని రేకెత్తించేవిగా ఉన్నాయి. ఈ ప్రమాదకర రహదారులు కొందరికి సాహసయాత్రగా అనిపిస్తే.. మరికొందరికి మాత్రం ప్రాణ సంకటంగా మారవచ్చు. అలాంటి దేశంలోని ప్రమాదకరమైన మార్గాలను ఈ కథనంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాధారణ మార్గాల్లో వెళ్లినట్లుగా నేరుగా ఈ మార్గాల్లో ప్రయాణిస్తే పెను విపత్తు తప్పదు. ఎంతో అనుభవం కలిగిన వారు మాత్రమే ఈ డేంజరస్ రోడ్డు మార్గాల్లో ప్రయాణించగలరు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. నేషనల్ హైవే 22 (హిమాచల్ ప్రదేశ్)

నేషనల్ హైవే 22 (National Highway 22)ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటిగా కూడా పిలుస్తారు. ఇది అంబాలా నుంచి చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ గుండా ఇండో-టిబెట్ సరిహద్దులోని ఖాబ్ వరకు సాగుతుంది. ఈ ప్రయాణంలో నదులు, దేవాలయాలు, ఎత్తైన కొండచరియలు, సొరంగాలు వంటి అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అనేక మలుపులు, వంపులు ఉండటం వల్ల ఈ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ హైవేను హిస్టరీ ఛానల్ ప్రసారం చేసిన “IRT డెడ్‌లియస్ట్ రోడ్స్’ టీవీ సిరీస్‌లో కూడా ప్రస్తావించారు. రోడ్డుకు ఇరువైపులా రైలింగులు లేకపోవడం, రహదారి క్రమంగా ఇరుకుగా మారడం, తీవ్రమైన మలుపులు, అనూహ్య పరిస్థితులు, లోతైన కొండచరియలు ఈ మార్గంలో అడ్డంకులుగా ఉన్నాయి.

2. లేహ్ – మనాలి హైవే (Leh-Manali Highway)

లద్దాఖ్ నుంచి మనాలి వరకు సాగే 458 కిలోమీటర్ల ఈ హైవే.. ఉత్తర భారతదేశంలోని అత్యంత సవాలుతో కూడిన మార్గాల్లో ఒకటి. ఎత్తైన పాస్‌లను మంచు కప్పేయడం వల్ల ఇది మే నుంచి అక్టోబర్ వరకే తెరిచి ఉంటుంది. లద్దాఖ్ (జమ్మూ కాశ్మీర్) నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి వరకు సాగిన ఈ రెండు లేన్ల రహదారిలో చాలా చోట్ల డివైడర్లు ఉండవు. అనేక వంతెనలు, ఇరుకైన మార్గాలు, వంతెనలు లేని వేగంగా ప్రవహించే వాగులను దాటాల్సి ఉండటంతో అనుభవం ఉన్న డ్రైవింగ్ అవసరం. ప్రకృతి అందాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా.. ప్రమాదం మాత్రం ఎప్పుడూ పొంచే ఉంటుంది.

3. జోజిలా పాస్ (Zoji La Pass)

జోజిలా పాస్ దాటడం అంత సులభమైన విషయం కాదు. ఇది సముద్ర మట్టానికి సుమారు 3,528 మీటర్ల ఎత్తులో ఉండి లద్దాఖ్‌ను కాశ్మీర్‌తో కలుపుతుంది. ఈ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు ఒక చిన్న తప్పు చేసినా లేదా నియంత్రణ కోల్పోయినా మరణం సంభవించవచ్చు. సాధారణంగా ఈ మార్గంలో చమురు ట్యాంకర్లు, భారీ ట్రక్కులు ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. శీతాకాలంలో భారీ మంచు పడటంతో ఈ రహదారి మూసివేస్తారు. చాలా ఇరుకైన రహదారి కావడం, ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉండటం, బలమైన శీతల గాలులు ఈ మార్గంలో సవాళ్లు విసురుతుంటాయి.

4. రోహ్తాంగ్ పాస్ (Rohtang Pass)

భారతదేశంలోని ప్రమాదకర రహదారుల్లో రోహ్తాంగ్ పాస్ ఒకటి. ఇది హిమాలయాల్లోని పిర్ పంజాల్ శ్రేణి (Pir Panjal Range) తూర్పు భాగం అంచున ఉంది. సముద్ర మట్టానికి 3,980 మీటర్ల ఎత్తులో సాగుతూ.. మనాలి నుంచి కులు లోయ, లాహౌల్, స్పితి లోయలను కలుపుతుంది. నిర్మాణ సామగ్రి, రోజువారీ అవసరాల సరుకులను తరలించే ట్రక్ డ్రైవర్లకు ఇది కీలక మార్గంగా ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, భారీ మంచు, తరచూ కొండచరియలు విరిగిపడటం, ప్రమాదకర మలుపులు, మట్టి రోడ్డు ఈ మార్గంలో సవాళ్లుగా నిలుస్తాయి.

5. ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Expressway)

ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వేను దేశంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటిగా పిలుస్తారు. ఇది భారతదేశంలో తొలి ఆరు లేన్ల కాంక్రీట్ రహదారి ఇదే కావడం విశేషం. 94.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి దేశ ఆర్థిక రాజధాని ముంబయిని.. పుణె నగరంతో కలుపుతుంది. సతారా, సంగ్లీ, కొల్హాపూర్, బెలగావి, హుబ్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి ముంబయికి సరుకు రవాణా చేసేందుకు ఈ మార్గం కీలకం. ఈ రహదారి ప్రారంభమైన తొలి పదేళ్లలో 1,758 ప్రమాదాలు, 400కి పైగా మరణాలు సంభవించాయి. భారీ ట్రాఫిక్, కొండచరియలు కూలడం, దోపిడీలు జరుగుతుండటంతో ఈ హైవే ప్రమాదకరమైన మార్గోల్లో ఒకటిగా మారిపోయింది.

6. ఖార్దుంగ్ లా పాస్ (Khardung La Pass)

ఖార్దుంగ్ లా పాస్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహన రహదారిగా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 5,359 మీటర్ల (17,582 అడుగులు) ఎత్తులో ఉంది. లద్దాఖ్ శ్రేణిలో ఉన్న ఈ మార్గం లద్దాఖ్‌ను కాశ్మీర్‌తో కలుపుతుంది. నుబ్రా లోయకు ఇది ప్రధాన ద్వారం కాగా.. ఈ లోయకు అవతలే సియాచిన్ గ్లేషియర్ ఉంది (Siachen Glacier). సైనిక అవసరాల కోసం ఇది అత్యంత వ్యూహాత్మకంగా మార్గంగా ఉంది. తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మే వరకు ఈ రహదారిని మూసివేస్తారు. మంచు గడ్డకట్టడం వల్ల రహదారి జారిపోవడం, ఎత్తులో ఉండటం వల్లే వచ్చే అనారోగ్య సమస్యలు, కొండచరియలు విరిగిపడటం ఈ మార్గంలో సవాళ్లు విసురుతుంటాయి.

Also Read: Crime Report 2025: విశాఖలో పెరిగిన హత్యలు.. తగ్గిన అత్యాచారాలు.. క్రైమ్ రిపోర్టులో సంచలన లెక్కలు

7. కిన్నౌర్ రోడ్ (Kinnaur Road)

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ రోడ్ భారతదేశంలోని అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటి. ఇది కిన్నౌర్ జిల్లా (Kinnaur district)లోని బస్పా నది లోయ (Baspa River gorge) గుండా సాగుతుంది. ఊగే సస్పెన్షన్ వంతెనలు, గట్టి రాతి కొండచరియల మధ్యగా ప్రయాణించడం డ్రైవర్లకు గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన భాగం “తరాండా ధాంక్” (Taranda “Dhank)గా పిలుస్తారు. ఈ ప్రదేశానికి వచ్చే సరికి రోడ్డు.. అమాంతం కిందకు జారుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇరుకైన మార్గం కావడం, అక్టోబర్ నుంచి మే వరకు మంచు కారణంగా మార్గం మూసుకుపోవడం, తరచూ కొండచరియలు కూలడం, గడ్డకట్టిన పర్వత అంచులు, వాగులు, జలపాతాలు ఈ మార్గంలో దర్శనమిస్తాయి.

Also Read: Delhi Shopping Mall: మూతపడ్డ మాల్‌లోకి వెళ్లిన ఫ్రెండ్స్.. శవంగా తిరిగొచ్చిన టీనేజర్.. అసలేం జరిగింది?

Just In

01

Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Battle of Galwan: గల్వాన్ సినిమాపై చైనా అక్కసు.. భారత్ స్ట్రాంగ్ రియాక్షన్.. డ్రాగన్‌కు చురకలు!

Bangladesh Violence: షాకింగ్.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

Santhakumari: మోహన్‌లాల్‌ తల్లి శాంతకుమారి కన్నుమూత

Self Care Tips: మనసు తట్టుకోలేనంత ఒత్తిడితో నిండి ఉందా?.. అయితే, ఈ చిట్కాల పై ఓ లుక్కేయండి!