Kiran Royal warns YCP
తిరుపతి

Kiran Royal warns YCP: ఇదేం వార్నింగ్.. ఏకంగా బట్టలూడదీసి కొడతారట!

Kiran Royal warns YCP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. పవన్ కుటుంబ సభ్యులను తీసుకొస్తూ కొందరు నెట్టింట తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. పవన్ పరువుకు భంగం కలిగేలా పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది గమనించిన జనసేన పార్టీ ముఖ్యనేత కిరణ్ రాయల్ (Kiran Royal).. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

‘బట్టలూడదీసి కొడతా’
తిరుపతికి చెందిన జనసేన ముఖ్య నేత కిరణ్ రాయల్.. పవన్ (Pawan Kalyan) పై జరుగుతున్న విషప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ (Tirupati Rural Police Station) కంప్లైంట్ ఇచ్చిన అనంతరం కిరణ్ రాయల్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష వైసీపీ (YSRCP Party)పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ గురించి వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో ఇష్టమెుచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అలాగే ప్రవర్తిస్తే బట్టలూడదీసి కొడతామంటూ హెచ్చరించారు.

’48 గంటల్లో అరెస్టు చేయాలి’
డిప్యూటీ సీఎంగా రాష్ట్రాభివృద్ధికి పవన్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కావాలని.. కుటుంబ సభ్యుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. పవన్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిని 48 గంట్లలో అరెస్టు చేయాలని పోలీసులకు కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రోడ్డెక్కి దర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: Hight Court – Vishnupriya: విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనా? క్వాష్ పిటిషన్ కొట్టివేత

లోకేష్ పైనా కామెంట్స్
పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేష్ (Nara Lokesh)ను సైతం టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెట్టింట కామెంట్స్ చేసిందని కిరణ్ రాయల్ ఆరోపించారు. టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని గుర్తించాలంటూ లోకేష్ పై చేసిన పోస్టులకు సంబంధించిన పేపర్లను మీడియాకు చూపించారు. సోషల్ మీడియాపై పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాలని కిరణ్ రాయల్ కోరారు. పవన్ పై విషం చిమ్ముతున్న సోషల్ మీడియా అకౌంట్ల (Anti Pawan Social Media Accounts) వివరాలను పోలీసులకు అందజేసినట్లు రాయల్ తెలిపారు.

Also Read This: Bengaluru Crime: అత్యంత కిరాతకం.. భార్యను ముక్కలుగా నరికిన భర్త.. ఆపై సూట్ కేస్ లో

వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్
బూతుల విషయంలో కాకుండా అభివృద్ధి విషయంలో పోటీ పడదామని వైసీపీ శ్రేణులకు (YSRCP Cader) కిరణ్ రాయల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏడాది కాలంలో తామ నాయకుడు చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాము సిద్ధమని అన్నారు. అలాకాకుండా పవన్ ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తే తొలుత తాము లీగల్ గా వెళ్తామని పేర్కొన్నారు. ఇంకా వారు తమ చర్యలను మానుకోకుంటే ఇల్లీగల్ గా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం