Chandragiri MLA
ఆంధ్రప్రదేశ్, తిరుపతి, లేటెస్ట్ న్యూస్

Andhra Pradesh: ట్రాన్స్‌ఫ‌ర్ ఆపాలంటే టీడీపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోవాల్సిందే!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు విర్రవీగిపోతున్నారు..! ఎంతలా అంటే రేపొద్దున్న సంగతి దేవుడెరుగు.. ఉన్నన్ని రోజులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ఇక సదరు ఎమ్మెల్యేను చూసుకొని అనుచరులు, ద్వితియ శ్రేణి నేతలు రెచ్చిపోతున్నారు. ఇలా ఒకచోట కాదు.. రెండు చోట్ల కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దినపత్రికలు, టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో వస్తున్న పక్కా ఆధారాలతో కథనాలు, వీడియోలే ఇందుకు నిదర్శనం. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు వెలుగుచూశాయి. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే వామ్మో.. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రాలో ఉన్నాయా? అని ఓట్లేసిన కార్యకర్తలు, జనాలు, అభిమానులే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇంతకీ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకిలా చేశారు..? బాధితులు ఏం చెబుతున్నారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇదీ అసలు సంగతి..!
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా నిత్యం వార్తల్లో, అంతకుమించి వివాదాల్లో నిలుస్తుండటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆయన ఎన్ని వివాదాల్లో తలదూర్చారో.. ఎన్నెన్ని ఆరోపణలు వచ్చాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఇక అసలు విషయానికొస్తే.. వైసీపీ మద్దతుదారులనే ఆరోపణతో సచివాలయ ఉద్యోగిని అకారణంగా పులివర్తి నాని బదిలీ చేయించారు. దీంతో ఇది కాస్త పెను వివాదంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం ఒక్క చంద్రగిరిలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ మద్దతుదారులమనే ఆరోపణతో ఏఎన్ఎం అయిన తన భార్యను కుప్పం సచివాలయం నుంచి మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారని బాధితురాలి భర్త ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే నాని కాళ్లు పట్టుకుంటే ట్రాన్స్‌ఫ‌ర్ ఆపేస్తామని అధికారులు చెబుతున్నారని బాధితురాలు వాపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేను అండతోనే సచివాలయ ఉద్యోగులను ట్రాన్స్‌ఫ‌ర్ పేరుతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలి భర్త మీడియాకు వెల్లడించారు.

కాళ్లు పట్టుకుంటారా.. లక్ష కడతారా!
ఈ అక్రమ బదిలీలు ఆపాలంటే రెండు ఛాయిస్‌లు ఇవ్వడం గమనార్హం. అందులో ఒకటి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోవడం.. రెండు లక్ష రూపాయిలు ఇచ్చుకోవడం. బదిలీలను అడ్డుకోవడానికి.. లేదా కోరుకున్న చోటుకు బదిలీ కావడానికి డబ్బులు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. రాజకీయ నాయకుల సిఫార్సులు అవసరం కావడం అనేది పారదర్శకత లేకపోవడానికి.. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతికి స్పష్టమైన సంకేతమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ పనిని సక్రమంగా నిర్వహించడానికి బదులు, బదిలీల కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కాల్సి రావడం వారి నైతికతను దెబ్బతీస్తుంది. అర్హత, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు అన్యాయానికి గురవుతారని భావించినప్పుడు వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బదిలీల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే, స్పష్టమైన బదిలీ విధానాలు, వాటిని పారదర్శకంగా అమలు చేయడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ సొంత పార్టీ కార్యకర్తల నుంచే వస్తుండటం గమనార్హం.

లేఖలో ఏముంది..?

Transfer Letter

 

Read Also- Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం