Bus Accident: ఇటీవలే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి. అయితే, తాజాగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. హైవే పై అయ్యప్పల బస్సు బోల్తా పడటంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
రైటర్ సత్రం దగ్గర సౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అయ్యప్ప స్వాములు గుంటూరు నుంచి అయ్యప్ప కొండకు వెళ్తున్నారు. అయితే, బస్సు లో ఉన్న వారందరూ అయ్యప్ప స్వాములు. ఈ బస్సు లో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయపడి ఆందోళన పడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. బస్సులో ఉన్న వారంతా నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

