Panchayat Elections: స్థానిక పంచాయతీ ఎన్నికలు సమాప్తం అయ్యాయి. తోడుగా, నీడగా కలిసున్న కుటుంబాలు, సన్నిహితులు పంచాయతీ ఎన్నికల కలహాలతో దూరమైపోయారు. ఒక్కో గ్రామపంచాయతీలో 1500 నుంచి 4 వేల రూపాయల వరకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అంతేకాకుండా మద్యం, మాంసం ఇస్తూ ఓటర్లను తమ వైపు సర్పంచ్ అభ్యర్థులు మళ్లించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు అత్యధికంగా పంపిణీ చేసిన ఓటర్లు మాత్రం ధర్మాన్ని, మంచి వ్యక్తిత్వం ఉన్న సర్పంచ్ అభ్యర్థులను నిరభ్యంతరంగా ఎన్నుకున్నారు. ఓటుకున్న పవర్‌ను నిజాయితీపరులు నిరూపించుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మద్యం మాంసానికి లొంగి ఓటర్లు తమ ఓటుకు ప్రాధాన్యత లేకుండా చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మమ్మ, మనవరాలు పోటీపడి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నదమ్ములు ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఫలితాలు వచ్చాయి. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో పంతాలు మాత్రం తగ్గకుండా పోయాయి.
బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి
ఐదేళ్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో అతి సున్నితంగా స్నేహభావంగా కుటుంబ బాధ్యతగా మిగిలిన వారందరిలో ఎన్నికలు పగలను పంతాలను పెంచాయి. కరీంనగర్(Karimanagar) ఉమ్మడి జిల్లాలో కమలాపురం(Kamalapuram) అత్యధికంగా సర్పంచ్ ఎన్నికల్లో హోరాహోరీగా తమ మెజారిటీని నిరూపించుకునేందుకు సకలం వడ్డాయి. కాంగ్రెస్(Congress) పార్టీ అక్కడ బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి కప్పు సతీష్(Kappu Sathish) పై అన్ని విధాల హక్కులను ప్రదర్శించాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకటై బిజెపి బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు అన్ని రకాల హంగులను ప్రదర్శించాయి. అయినప్పటికీ నీతి, నిజాయితీ, ధర్మాన్ని చాటుకున్న సతీష్ ను 2150 ఓట్ల మెజారిటీతో ఓటర్లు గెలిపించుకున్నారు. ఒక్క ఈటల రాజేందర్(Etela Rajender)ను టార్గెట్ చేసుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు బిజెపి(BJP) బలపరిచిన సతీష్ ను ఓడించేందుకు సర్వం పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూసి ధర్మంపై అధర్మం గెలవదనే నిజాయితీ ఓటర్లు నిరూపించుకున్నారు.
Also Read: Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..
స్థానిక సంస్థల్లో అధికార పార్టీదే హవా
డిసెంబర్ 2025 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకొని అధికార పార్టీ హవా కొనసాగించేది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్(BRS) కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సగం సీట్ల కంటే కొంచెం తన ఆధిపత్యాన్ని కూడా నిరూపించుకుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ అంతంత మాత్రంగానే గెలిపించుకుంది. ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా 8 సీట్లు తెచ్చుకున్న బిజెపి స్థానిక సంస్థ ఎన్నికల్లో బోల్తా పడింది.
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు 2025
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలనే మూడో విడత సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసుకుంది. మూడు విడతల్లో కాంగ్రెస్ పార్టీ 7010 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని 56% ఓట్లను సాధించగలిగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 25%తో 3142 సర్పంచి స్థానాలను గెలుచుకుని మమ అనిపించుకుంది. ఇకపోతే బీజేపి పార్టీ 1242 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని 10% ఓటర్లను ఆకర్షించుకోగలిగింది. బీజేపీ పార్టీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు 1339 స్థానాలను గెలుచుకొని 9% ఓటర్లను ఆకర్షించుకోగలిగింది.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవ
ఉమ్మడి నల్గొండ(Nalgonda), వరంగల్(Warangal), ఖమ్మం(Khammam) జిల్లాలో మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమైంది. సిద్దిపేట(Sidhipeta) జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోగలిగింది. ఇకపోతే మూడు విడతల్లో కలిపి 1200 పైగా పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఓడిపోయిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి మరి తీసుకుంటామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు.

