Manoj Gaur arrested: తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థ జేపీ ఇన్‌ఫ్రా టెక్ ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. ప్రజలు ఫ్లాట్స్ కోసం కట్టిన దాదాపు రూ.12 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయనపై చర్యలు తీసుకున్నది. ఈయనకు చెందిన జేపీ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్, జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, వాటి అనుబంధ కంపెనీలకు చెందిన 15 ప్రాంతాల్లో గత మే నెలలో అధికారులు సోదాలు జరిపారు. ఆ సమయంలో రూ. 1.7 కోట్ల నగదు, కీలక డాక్యుమెంట్లు దొరికాయి. ఈ క్రమంలోనే మనీలాండరింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో మనోజ్ గౌర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
