Samsung Galaxy S26 Ultra: సామ్‌సంగ్ తన తదుపరి అల్ట్రా-ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ Galaxy S26 Ultra కోసం భారీగా సిద్ధమవుతోందని తాజా లీకులు చెబుతున్నాయి. కంపెనీ అధికారికంగా ఏమి ప్రకటించకపోయినా, వరుసగా బయటకు వస్తున్న రిపోర్టులు ఈ ఫోన్ 2026 ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ.. దాదాపు ప్రతి విభాగంలో ఈ మోడల్ మెజర్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది.
లీకుల ప్రకారం, గెలాక్సీ S26 అల్ట్రా ఫిబ్రవరి 2026లో గ్లోబల్‌గా లాంచ్ అవ్వబోతుంది. భారత మార్కెట్లో కూడా అదే నెలలో అంటే మార్చి ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండనున్నాయి. Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో 5,000mAh బ్యాటరీ కలిపి పనితీరును నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళుతుంది.
ఫోటోగ్రఫీ 200MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫోటో లెన్స్‌లతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌ను కెమెరా క్యాటగిరీలో మళ్లీ టాప్‌కి తీసుకెళ్లే అవకాశం ఉంది. కొత్త కలర్ ఆప్షన్లలో ఆరెంజ్ వెరియంట్ కూడా ఉండొచ్చని సమాచారం ఉంది. కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లు, ప్రీమియమ్ మెటీరియల్స్, అధిక కంపోనెంట్ ఖర్చులు కారణంగా భారత మార్కెట్లో దీని ధర రూ.1,34,999 నుండి రూ.1,39,999 మధ్య ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. మొత్తానికి, గెలాక్సీ S26 అల్ట్రా 2026లో అత్యంత శక్తివంతమైన మరియు టెక్ ప్రపంచంలో ఎక్కువగా చర్చించబడే ఫ్లాగ్‌షిప్‌గా నిలిచే అవకాశాలున్నాయి.
