Marries Dead Lover: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన ప్రేయసి
Love-Tragedy (Image soucre X)
Viral News, లేటెస్ట్ న్యూస్

Marries Dead Lover: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి.. చంపింది ఆమె కుటుంబ సభ్యులే.. కన్నీటి విషాద ప్రేమగాథ

Marries Dead Lover: కులాలను ఎదురించిన ప్రేమగాథలు ఎన్నో విషాదాంతమయ్యాయి. ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా, మరో ప్రేమకథలోనూ ఇలాంటి విషాదమే మిగిలింది. కులోన్మాదానికి ఒక నిండు ప్రాణం కూడా పోయింది. కానీ, చివరికి ప్రేమే గెలిచింది. తన కన్నతండ్రి, అన్నయ్యలు కలిసి చంపేసిన ప్రియుడిని, అంటే మృతదేహాన్ని పెళ్లాడి మరీ ఓ యువతి తన ప్రేమను (Marries Dead Lover) గెలిచింది. హృదయాలను కలచివేస్తున్న ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగింది.

కులాంతర ప్రేమకు ఓ యువకుడు బలయ్యాడు. ఆంచల్ టాటే అనే 20 ఏళ్ల యువకుడు, సక్షమ్ అనే యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు. దాదాపు మూడేళ్లపాటు వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగింది. విషయం ఇంట్లో తెలిసిపోవడంతో సక్షమ్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. పెళ్లి చేసుకోబోతున్నారనే తెలిసి యువకుడు ఆంచల్ టాటేను గత గురువారం దారుణంగా హత్య చేశారు. ఎంతలా అంటే తీవ్రంగా కొట్టి, తుపాకీతో కాల్చి, తల మీద రాయితో మోది చంపారు.

Read Also- India vs South Africa: రాంచీ వన్డేలో దుమ్ము దులిపిన టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్

అయితే, అంత్యక్రియల సమయంలో అత్యంత నాటకీయమైన పరిణామం చోటుచేసుకుంది. టాటే అంత్యక్రియల సమయంలో ప్రియురాలు సక్షమ్ అక్కడి వెళ్లి జీవచ్ఛవంగా పడివున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది. నుదుటన బొట్టు పెట్టుకుని, టాటే భార్యగా జీవితాంతం అతడి ఇంట్లోనే ఉంటానని శపథం చేసింది. మృతదేహానికి పసుపు రాసి, తన నుదుట సిందూరం దిద్దుకొని, చనిపోయిన తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం అక్కడున్న వారిని కదిలించింది.

తన ప్రియుడు చనిపోయినా తమ ప్రేమ గెలిచిందని ఆమె చెప్పింది. తన తండ్రి, సోదరులు ఓడిపోయారని సక్షమ్ కన్నీటి పర్యంతమైంది. టాటే చంపినవారిని ఉరికంబం ఎక్కించాలని ఆమె డిమాండ్ చేసింది. టాటే చనిపోయినా, తమ ప్రేమ సజీవంగానే ఉందని, అందుకే తాను అతడిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. కాగా, ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు. దర్యాప్తు తర్వాత సమగ్రమైన విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, తన సోదరుల ద్వారా సక్షమ్‌కు ఆంచల్ టాటే పరిచయం అయ్యాడు. తరుచుగా ఇంటికి వచ్చేవాడు కావడంతో వారిద్దరూ దగ్గరయ్యారు. మూడేళ్ల పాటు వారి ప్రేమ బంధం కొనసాగింది. అయితే, వేర్వేరు కులాలు కావడంతో యువతి సక్షమ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. హత్య చేయడానికి ముందు పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ, ఆంచల్ టాటేను పెళ్లి చేసుకొని, అతడితోనే ఉంటానని ఆమె చెప్పింది. కులోన్మాదపు క్రూరత్వానికి ఒక యువకుడి ప్రాణం బలైనప్పటికీ, శారీరక మరణం ప్రేమబంధాన్ని విడదీయలేదని ప్రేయసి నిరూపించినట్టు అయింది. హంతకులకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.

Read Also- Imran Khan Health: ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు.. పాకిస్థాన్ చట్టసభ్యుడి సంచలన వ్యాఖ్యలు

Just In

01

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!