India vs South Africa: రాంచీ వన్డే బ్యాటింగ్‌లో చెలరేగిన టీమిండియా
Ranchi-ODI (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India vs South Africa: రాంచీ వన్డేలో దుమ్ము దులిపిన టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్

India vs South Africa: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో, ప్రత్యర్థి సఫారీ జట్టుకు 350 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ఈ భారీ స్కోర్ సాధ్యమైంది.

రాణించిన కోహ్లీ.. రోహిత్, రాహుల్ కీలక ఇన్నింగ్స్..

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. 120 బంతులు ఎదుర్కొని 135 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇక, డాషింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 57 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతులు ఎదుర్కొని 60 రన్స్ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 8, వాషింగ్టన్ సుందర్ 13, రవీంద్ర జడేజా 32, హర్షిత్ రాణా 3 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 0, కుల్దీప్ యాదవ్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.

Read Also- Virat Century: రాంచీ వన్డేలో విరాట్ విధ్వంసం.. సచిన్ సెంచరీల రికార్డ్ కనుమరుగు

దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించారు. మార్కో యన్సెన్, నాండ్రే బర్గర్, కోర్బిన్ బాష్, బార్ట్‌మన్ తలో రెండేసి వికెట్లు తీశారు. కాగా, దక్షిణాఫ్రికాకు భారత్ భారీ టార్గెట్ నిర్దేశించినప్పటికీ, టార్గెట్‌ను ఎలా కాపాడుకుంటుందనేది చూడాలి. రాత్రిపూ మంచుకురుస్తుండడంతో బంతి తడిగా మారి, బౌలింగ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. టాస్ విషయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఇదే మాట చెప్పాడు. రాత్రిపూట మంచు కారణంగా బౌలింగ్‌ చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని, అందుకే, ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నామని అన్నాడు. భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే మాట అన్నాడు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. మరి, భారత బౌలర్లు ఎలా రాణిస్తారో వేచిచూడాలి.

Read Also- Rohit Sharma: దక్షిణాఫ్రికా రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్.. ప్రపంచ సిక్సర్ల రికార్డ్ బ్రేక్

Just In

01

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!