PV Narasimha Rao Statue: పీవీ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల
PV Narasimha Rao Statue ( image credit: swetcah reporter)
Telangana News

PV Narasimha Rao Statue: పీవీ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల.. ముఖ్య అతిథిగా రానున్న పీవీ ప్రభాకర్ రావు!

PV Narasimha Rao Statue: పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 21న (ఆదివారం) నిర్వహించనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య పిలుపునిచ్చారు. ఆయన పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి మాట్లాడుతూ, మధ్యాహ్నం 2:30 గంటలకు పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

Also Read: CPM Madupalli Gopala Rao: లిఫ్ట్ మరమ్మతులు వెంటనే చేయించాలని సీపీఎం నేతలు నిరసన

దాతలకు ప్రత్యేక సన్మానం

అనంతరం స్థానిక క్లబ్‌లో జరిగే సమావేశంలో విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు ప్రత్యేక సన్మానం ఉంటుందని పేర్కొన్నారు. పీవీ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, చందుపట్ల జనార్దన్, మాధవరావ్, సంపత్ రావు, వెంకన్న, స్వామి, మనోజ్, మాజీ సర్పంచ్ సుధాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు సదానందం, సుభాష్, వెంగళరావు, చిలుకమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Thummala Nageswara Rao: ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి తుమ్మల స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!

Jagan Birthday Cutout: వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం ముందు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు

Pawan Kalyan on YCP: అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా? పవన్ మాస్ వార్నింగ్!