CPM Madupalli Gopala Rao: మధిర మండలం తొర్లపాడు గ్రామంలో కట్టలేరు పై ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఉపయోగంలో తీసుకువస్తే సుమారుగా 400 ఎకరాల భూమి రెండు పంటలకు అవకాశం ఏర్పడుతుందని స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు సిపిఎం పార్టీ బృందం లెఫ్ట్ కాలువను సిపిఎం(CPM) బృందం సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు(Gopala Rao) ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి కమ్యూనిస్టు ఉద్యమ నేత నల్లమల గిరి ప్రసాద్(Giri Prasad) సహకారంతో తొర్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో కట్టలేరుపై లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పనులను మొదలు పెట్టాలని డిమాండ్
ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై లిఫ్ట్ మోటర్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, లిఫ్ట్ పైపులు, లిఫ్ట్ కాలువలు అన్ని నిరుపయోగంగా మారాయని ఆరోపించారు. లిఫ్ట్ కొరకు కట్టలేరుపై చెక్ డాం(Check dam) నిర్మించిన ప్రభుత్వం నీటిని తోడి రైతులకందించేందుకు అవసరమైన పరికరాలు సమకూర్చడం, రిపేర్లు చేయించడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదన్నారు. రూ.కోట్లలతో నిర్మించిన చెక్ డ్యాం నిరుపయోగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పూడికతో నిండి పోయిందని అధికారులు వెంటనే స్పందించి పూడికతీత పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఈ చెక్ డాం సందర్శించి వెంటనే రిపేర్లు చేయించి రైతులకు రెండు పంటలు పండించుకునేందుకు నీళ్లు అందించాలని స్థానిక రైతులు సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని మడుపల్లి గోపాల్ రావు అన్నారు.
గ్రామపంచాయతీతో పాటు
ఈ చెక్ డ్యామ్ అందుబాటులోకి రావడం వల్ల తొండల గోపారం(Thondala Goparam) గ్రామపంచాయతీ తో పాటు చిలుకూరు(Chilukuru) గ్రామంలో కొంత భాగానికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ చెక్ డ్యామ్ పరిశీలన కార్యక్రమంలో సిపిఎం(CPM) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నర్సింహారావు(Narasimha) పార్టీ మండల కార్యదర్శి మందా సైదులు, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, ఎర్రుపాలెం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్, గ్రామ నాయకులు మద్దాల ఏబు, గ్రామ రైతులు సూర్య ప్రకాష్ రెడ్డి, వీరరెడ్డి, కాశిబోయిన శ్రీనివాసరావు, మధవరావు, గోపి శీరం రమేష్, అక్షయ్, గంజినబోయిన శివ, పాల్గొన్నారు.
Also Read: Medchal highway: నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు.. రాకపోకలకు ఇబ్బందులు
