Deputy Sarpanch Powers: ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు..!
Deputy Sarpanch Powers (imagecredit:twitter)
Telangana News

Deputy Sarpanch Powers: ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

Deputy Sarpanch Powers: నూతనంగా ఏర్పాటైన మండలాలు, గ్రామపంచాయతీలలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్‌ఎఫ్‌సీ), 15వ ఆర్థికసంఘం పథకాలకు సంబంధించి బ్యాంక్‌ అకౌంట్లు తెరవాలని ఆదేశించానని, ఈ ఆదేశాల్లో ఉపసర్పంచ్‌ స్థానంలో పొరపాటున పంచాయతీ కార్యదర్శి అని వచ్చిం‍దని పంచాయతీరాజ్‌,​‍ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ డా.జి.సృజన తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అది పొరపాటున వచ్చిందని గ్రహించి వెంటనే సవరణ చేశామని వెల్లడించారు. ఆ సవరణ ఉత్తర్వులను విడుదల చేశారు. ఉపసర్పంచ్‌ లకు చెక్‌ పవర్‌ తీసి వేయలేదన్నారు.

ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్దికసంఘం గ్రాంట్లు, రాష్ట్ర మ్యాచింగ్‌ ​‍గ్రాంట్‌ (ఎస్‌ఎఫ్‌సీ) సర్దుబాటు కోసం కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు కొత్త భ్యాంక్‌ ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్‌,​‍ గ్రామీణాభివృద్ధిశాఖ సూచించింది. స్థానిక గ్రామీణసంస్థలకు 15వ ఆర్థికసంఘం గ్రాంట్ల విడుదల, వినియోగం విషయంలో ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపింది. ఈ నిధుల వినియోగంలో ఇకపై మన్యూవల్‌ చెలింపులకు బదులు అన్నీ పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌), ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారానే జరపాల్సి ఉంటుంది. అన్ని లావాదేవీలు డిజిటల్‌ ఫ్లోను పాటించాల్సి ఉంటుందని మంగళవారం జడ్పీసీఈవోలు, డీపీవోలకు పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్‌ సృజన మెమో జారీచేశారు.

Also Read: Google: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే గూగుల్ ఫీచర్ గురించి తెలుసా?

జాయింట్‌ డిజిటల్‌ సంతకాలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ పేరు మీద 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒకటి, రాష్ట్ర వాటా గ్రాంట‍్లకు మరొకటి చొప్పున ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. దీనికిసంబంధించి గ్రామసభ/ సర్వసభ్యసమావేశంలో తీర్మానం చేయాలని సూచించారు. జాయింట్‌ డిజిటల్‌ సంతకాల (డీఎస్సీ) చెల్లింపుల ఆమోదానికి రెండెంచల వ్యవస్థ ఉంటుంది. ఉపసర్పంచ్‌, ఎంపీడీవో(MPDO) ల ద్వారా వోచర్‌తయారీ దీనికి సర్పంచ్‌, ఎంపీపీ అధ్యక్షుడు తుది ఆమోదం తెలపాల్సి ఉంటుందని. ఇందుకోసం గ్రామసభ తీర్మానం తప్పనిసరిఅని కొత్తపంచాయతీలు ఎల్‌జీడీ కోడ్‌తో పీఎఫ్‌ఎంఎస్‌తో నమోదు కావాలని, విక్రేతలు (వెండర్స్)కూడా పోర్టల్‌లో రిజిష్టర్‌ అయి​ ఉండాలి. నిధుల పారదర్శకత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో డిజిటల్‌ పర్యవేక్షణను, సర్పంచ్‌-ఉపసర్పంచ్‌ల ఉమ్మడి డిజిటల్‌ ఆమోదాన్ని అమల్లోకి తెచ్చింది.

Also Read: Google: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే గూగుల్ ఫీచర్ గురించి తెలుసా?

Just In

01

Attempted Murder: నా తమ్ముడిని చంపిందన్న కసితో.. బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?

UP Man: యూపీలో సంచలనం.. కుక్కలా మారిన యువకుడు.. కనిపించిన వారిపై దాడి

Personal Loan: పర్సనల్ లోన్ డీఫాల్ట్ తర్వాత కోర్టు నోటీసులు రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి

Demon Pavan: అక్కడ లవ్ ఎమోషన్ ఆర్గానిక్‌గా వచ్చిందే.. డెమోన్ పవన్

Naresh IndiGo: ఇండిగో తీరుపై నటుడు నరేష్ ఆగ్రహం.. పశువుల్లా కుక్కుతున్నారంటూ ఫైర్..