Attempted Murder: బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?
Attempted Murder (imagecredit:swetcha)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Attempted Murder: తమ్ముడ్ని చంపిందన్న కసితో.. బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?

Attempted Murder: జనగామ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి, తన మరదలిని చంపేందుకు బండరాయితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యాయస్థానంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి.

ఇరు వర్గాల మధ్య కేసులు

సిద్దిపేట జిల్లా చుంచనకోటకు చెందిన బూడిద అశోక్(Budida Ashock), అర్చన దంపతుల మధ్య గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మనస్పర్థలు రావడంతో అర్చన పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్ల క్రితం అత్తగారింటికి వెళ్లిన అశోక్, అక్కడ జరిగిన ఘర్షణలో మరణించాడు. అశోక్ మృతికి అర్చనే కారణమని ఆమె బావ నరసింహులు కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య కేసులు నమోదై వాయిదాలు నడుస్తున్నాయి. మంగళవారం ఈ కేసు వాయిదా ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు జనగామ కోర్టుకు హాజరయ్యారు.

Ayurveda Doctors: ఆంధ్రప్రదేశ్‌లో ఆయుర్వేద వైద్యులకు పెద్ద ఊరట.. 58 శస్త్రచికిత్సలకు అధికారిక అనుమతి

పోలీసులు అడ్డుకోవడంతో

తన తమ్ముడి మరణానికి అర్చన కారణమనే కోపంతో ఉన్న నరసింహులు, కోర్టు ప్రాంగణంలోనే ఒక్కసారిగా బండరాయితో ఆమె తలపై మోదాడు. ఈ దాడిలో అర్చన తీవ్ర గాయాలై అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే అడ్డుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అర్చనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నరసింహులును పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు న్యాయస్థానం ఆవరణలోనే ఈ స్థాయిలో హత్యాయత్నం జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Google Gemini App: Gemini యాప్‌కు పెద్ద అప్డేట్.. డిఫాల్ట్ AIగా Gemini 3 Flashను తీసుకొచ్చిన Google

Just In

01

Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు నన్ను కలవండి.. అతని నెంబర్ ఇస్తా!

Bhatti Vikramarka: అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం… ప్రజా సంక్షేమమే లక్ష్యం.. భట్టి విక్రమార్క హెచ్చరిక!

Telangana state: సీఎం రేవంత్ ఖాతాలో మరో ఘనత.. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానం

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సిద్ధం.. ఈ కేసులో తదుపరి అడుగు ఏంటి?

Attempted Murder: తమ్ముడ్ని చంపిందన్న కసితో.. బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?