Ankam Jyoti: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్(Ankam Jyoti Foundation) డైరెక్టర్ అంకం జ్యోతి(Ankam Jyoti) చిన్న వయసులోనే తల్లితండ్రులను కోల్పోయి తినడానికి కూడా కష్టంగా బ్రతికినా తలుచుకోని గత 15 సంవత్సరాలుగా తను సొంత డబ్బులతో రోడ్డు పైన ఉండే పేద ప్రజలకు అన్నం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ అలాగే రోడ్డు పైన వదిలేసిన వారిని వృద్ధాశ్రమంలో చేర్పించడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.
క్రికెటర్ యువరాజ్ సింగ్
అందుకు గాను మూడు సార్లు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు కి ఎంపికై ఈరోజు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) జన్మదినం సందర్భంగా నిజామాబాద్ U V ఫౌండేషన్ డైరెక్టర్ సుజన్(Sujan) ఆధ్వర్యంలో ఈరోజు జన్నేపల్లిలో బ్లడ్ క్యాంప్, కంటి చికిత్స, క్యాన్సర్ సంబంధిత క్యాంప్స్ మరియు దంత సమస్య వంటి కార్యక్రమాలు, ప్రముఖులకు సత్కారాలు అందించడం జరిగింది. అంతే కాకుండా సుజన్ మరియు వారి సతీమణి చేతుల మీదుగా సేవ భారతి అవార్డును, సర్టిఫికెట్ తో అంకం జ్యోతి కుటుంబసభ్యులను సన్మానించడం జరిగింది. నన్ను నా సేవలను గుర్తించి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు U V ఫౌండేషన్ సుజన్‌కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అన్నారు.
Also Read: KTR: రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన బిల్లు ఉండాలి.. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచనలు!

