Kissik Talks With Varsha: బిగ్ బాస్ 5 రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక సింగ్ (BB5 Priyanka Singh), తాజాగా ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha) అనే పోడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అనుభవాలకు సంబంధించిన అనేక సంచలన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింకీ (Pinky) మాటలు ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను కళ్లకు కట్టేలా ఉన్నాయి.
సోషల్ మీడియాపై తీవ్ర వ్యతిరేకత
సోషల్ మీడియా అంటే తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పింకీ తెలిపారు. వ్యూస్, లైక్స్, కామెంట్ల కోసం మనుషులు హద్దులు దాటి అభ్యంతరకరమైన కంటెంట్‌తో నిండిపోవడం, బూతులు మాట్లాడటం వంటివి తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉండే వాళ్లు కూడా సోషల్ మీడియా ప్రభావంతో చాలా వియర్డ్‌గా తయారవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తన పాత పేరు ‘సాయి’ అని పిలవాలా లేక ‘ప్రియాంక’ అని పిలవాలా వంటి ప్రశ్నలు అడగడం తనకు ఎంతమాత్రం నచ్చదని ఆమె చెప్పింది. పాత విషయాలను గుర్తు చేసి మళ్లీ మళ్లీ హర్ట్ చేస్తుంటారనే ఉద్దేశంతోనే తాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడనని, జనాలు ఇంకా ఎనిమిదేళ్లు, పదేళ్లు వెనకబడి ఉన్నారని తనకు అనిపిస్తుందని ఎమోషనల్‌గా మాట్లాడారు.
Also Read- Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!
మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) అండదండలు
కెరీర్ విషయంలో ఎదురైన చేదు అనుభవాన్ని పింకీ పంచుకున్నారు. ఒక కామెడీ షోలో స్కిట్ ప్రాక్టీస్ కోసం మేకప్ వేసుకొని సిద్ధమైన తర్వాత, చివరి నిమిషంలో ఆమెను పక్కన పెట్టారని, ‘నువ్వు ఈ షో చేయడం కరెక్ట్ కాదేమో, షోకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో’ అని కొందరు అన్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా, ‘ఆ అమ్మాయి ఉంటే నేను చేయనండి’ అని చెప్పిన ఆర్టిస్టులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ఈ అవమానం, మాటల దాడి తట్టుకోలేక ఒక ఏడాది పాటు బెడ్ రెస్ట్‌లో ఉన్నానని ఆమె చెప్పారు. ఆ కష్టకాలంలో మెగా బ్రదర్ నాగబాబు తనకు అండగా నిలబడ్డారని పింకీ కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు. ‘ఆ సమయంలో నాకు నాగబాబు సార్ హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్‌గా గానీ, మెడిసిన్స్ పంపించడం గానీ, ఎవ్రీ మంత్ నాకు మనీ పంపించడం గానీ ఆయన చేశారు’ అని ఆమె చెప్పడం చూస్తుంటే.. ఆమె అనుభవించిన కష్టం, అవమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Peddi: 150 మిలియన్ల క్లబ్‌లోకి ‘చికిరి చికిరి’.. వృద్ధి సినిమాస్ నిర్మాత సంచలన పోస్ట్
అలాంటి ముద్ర వేశారు
తన వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడుతూ.. తన రిలేషన్ నాలుగు గోడల మధ్య బాగానే ఉండేదని, కానీ నలుగురిలో కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదని ఆమె బాధపడ్డారు. ట్రాన్స్ గర్ల్స్ అంటే ఓన్లీ లైంగిక భావంతోనో, లేదంటే వాళ్ళతో ఉంటే చీప్‌గా కనిపిస్తారని ప్రజల్లో ఉన్న అపనమ్మకం, చిన్న చూపు కారణంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని పింకీ ఆవేదన వ్యక్తం చేశారు. సంచలనాత్మక విషయాలతో నిండిన ఈ ఇంటర్వ్యూ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

