Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) భారీ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ (Chikiri Chikiri Song) ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత చూస్తూనే ఉన్నారు. ఈ పాట విడుదలైన నిమిషం నుంచే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అదరగొట్టింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ‘చికిరి చికిరి’ ఖండాలలో ప్రతిధ్వనించింది. భాషా సరిహద్దులను అప్రయత్నంగా దాటి, సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందులోని వైరల్ బీట్‌లు, జానపద-మూలాలున్న పల్స్, సినిమాటిక్ సౌండ్‌స్కేప్ ప్రపంచంలోని ప్రతి మూల నుండి శ్రోతలను అలరించాయి. అన్ని భాషల్లో కలిసి ఈ సాంగ్ 150+ మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేయడంతో నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో..
Also Read- Mowgli Producer: సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌పై బండి సరోజ్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పిన నిర్మాత!
చాలా హ్యాపీగా ఉంది
చికిరి చికిరి పాట సృష్టించిన ప్రభంజనం అసాధారణం. ఈ పాట పట్ల ప్రేక్షకులు చూపిన ఆదరణ, ప్రేమ మాటల్లో చెప్పలేనిది. సాంగ్ ప్రోమో మొదలుకుని పూర్తి పాట వచ్చే వరకు, ఈ పాటపై అభిమానులు, సంగీత ప్రియుల స్పందన అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ కేవలం 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ పొందిన ఇండియన్ సాంగ్‌గా రికార్డు సృష్టించి గొప్ప మైలురాయికి చేరుకుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ పాట, కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, ఎంతో మంది అభిమానాన్ని పొందింది. ఇప్పటివరకు ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వ్యూస్, 1.8 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించింది. అంతేకాకుండా, ఇది ఆపిల్ మ్యూజిక్, స్పాటిఫై వంటి ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. గ్లోబల్ యూట్యూబ్ చార్ట్‌లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయం చిత్ర బృందానికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ పాటపై అభిమానులు చూపిన అపారమైన ప్రేమను, ఈ పాట యొక్క వైబ్‌ను సెలబ్రేట్ చేస్తూ 1 మిలియన్‌కు పైగా రీల్స్, షార్ట్స్ చేయడం ద్వారా చూపించారు. ఈ సక్సెస్‌తో చాలా హ్యాపీగా ఉన్నామని వృద్ధి సినిమాస్ నిర్మాత వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) తెలిపారు.
Also Read- Annagaru Vostaru: ‘అన్నగారు వస్తారు’కు ‘అఖండ 2’ తరహా కష్టాలు.. చివరి నిమిషంలో వాయిదా!
టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలను తెలియజేస్తూ, ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన అద్భుతమైన డ్యాన్స్, తెరపైన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే, తన చార్మ్‌తో ఈ పాటకు మరింత అందాన్ని జోడించిన జాన్వీ కపూర్‌కు ధన్యవాదాలు. ఈ అసాధారణమైన ప్రపంచ సంగీత తుఫానును సృష్టించినందుకు లెజెండరీ సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్‌కు, ఈ శక్తివంతమైన విజన్‌ను అందించిన దర్శకులు బుచ్చిబాబుకు, అద్భుతమైన విజువల్స్ అందించిన రత్నవేలుకు, అందమైన ప్రపంచాన్ని సెట్ చేసిన అవినాష్ కొల్లాకు, క్రిస్ప్ ఎడిట్‌తో మెప్పించిన నవీన్ నూలికి, సంచలనాత్మక స్టెప్పులను కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు, సింగర్‌కు.. ఈ పాట విజయం కోసం కృషి చేసిన చిత్ర బృందం మొత్తానికి ధన్యవాదాలని చెప్పారు. తమ విజన్‌ను నమ్మి తమతో చేతులు కలిపిన IVY ఎంటర్‌టైన్‌మెంట్‌కు, ఈ పాటను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో నిరంతరం కృషి చేసిన టి-సిరీస్‌కు కూడా వృద్ధి సినిమాస్ కృతజ్ఞతలు చెప్పింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారి నిరంతర సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని భాషల్లోని ప్రేక్షకులు, సంగీత ప్రియులు, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి ప్రేమ మాకు మరింత గొప్ప ప్రాజెక్టులను చేయడానికి ప్రేరణనిస్తుందని వృద్ధి సినిమాస్ తరపున వెంకట సతీష్ కిలారు పేర్కొన్నారు.
Thank you for making #ChikiriChikiri a huge chartbuster ❤🔥
Your love and response to the song are overwhelming ❤️
Bigger things are coming from #Peddi. pic.twitter.com/h3nzP6TPUS
— Vriddhi Cinemas (@vriddhicinemas) December 11, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

