Annagaru Vostaru: డిసెంబర్ 2025.. సినీ పరిశ్రమకు ఊహించని ఆర్థిక అడ్డంకులతో పాటు చివరి నిమిషపు వాయిదాలతో కూడిన మాసంగా మారింది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రానికి చట్టపరమైన ఇబ్బందులు ఎదురై, విడుదల వాయిదా పడిన విషయం మరువకముందే, ఇప్పుడు కార్తీ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అన్నగారు వస్తారు’ (తమిళంలో ‘వా వాతియార్’) కూడా అదే తరహా కష్టాలను ఎదుర్కొని చివరి నిమిషంలో వాయిదా పడింది. నిజానికి, ‘అఖండ 2’ చిత్రం తొలుత డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, నిర్మాతల గత చిత్రాలకు సంబంధించి ఉన్న పాత బకాయిల నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో సినీ పెద్దలందరూ కూర్చుని ఈ సినిమా కష్టాలను తీర్చి, డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు. సరిగ్గా అదే విధంగా, కార్తీ తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru)కు కూడా కోర్టు రూపంలో అడ్డంకి ఎదురైంది.
Also Read- Akhanda 2: ‘అఖండ 2’కు షాకుల మీద షాకులు.. టికెట్ల ధరల హైక్, ప్రీమియర్ అనుమతి జీవో వెనక్కి!
‘అన్నగారు వస్తారు’ను ఆపేసిన ‘కంగువా’
ఈ సినిమా నిర్మాత, కె.ఇ. జ్ఞానవేల్ రాజాపై ఉన్న పెండింగ్ బకాయిలను (‘కంగువా’ సినిమా నిమిత్తం.. దాదాపు రూ. 21 కోట్లు ఆయన బకాయి పడ్డారు) విడుదల కంటే ముందే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైనాన్షియర్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు, నిర్మాతకు భారీ షాక్ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే సెటిల్ చేయాలని నిర్మాతకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, బకాయిలు చెల్లించినట్లు ధృవీకరించే వరకు, ఈ చిత్రాన్ని ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ (థియేట్రికల్ లేదా ఓటీటీ) విడుదల చేయకూడదని స్టే విధించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, సినిమా విడుదల అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో, ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ పంపిణీదారులు ప్రత్యాంగిరా సినిమాస్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ వారు మాకు తెలియజేసిన ప్రకారం, #VaaVaathiyaar (తమిళం), #AnnagaruVostaru (తెలుగు) చిత్రాలు డిసెంబర్ 12న విడుదల కావలసి ఉండగా, ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డాయి’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read- Vijay Sethupathi: కింగ్ నాగార్జున వయసుపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
‘అఖండ 2’ను ఫాలో అయిన ‘అన్నగారు’
దీంతో డిసెంబర్ నెలలో సినిమాలకు ఈ కష్టాలేంటని అంతా కామెంట్స్ చేస్తున్నారు. ‘అఖండ 2’ను ఫాలో అయిన ‘అన్నగారు’ అంటూ కొందరు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ చిత్రంలో కార్తీ, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో దివంగత నందమూరి తారక రామారావు ప్రస్తావన కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. చిత్రం వాయిదా పడటంపై చిత్ర బృందం, ముఖ్యంగా నటీనటులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కార్తీ (Karthi), కృతి శెట్టి (Krithi Shetty) ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌లో ప్రమోషనల్ కార్యక్రమాలను పూర్తి చేసి, సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. చివరి నిమిషంలో వచ్చిన ఈ ఎదురుదెబ్బతో, ఇప్పటి వరకు చిత్ర బృందం చేసిన కృషి మొత్తం వృదా అయిందనే చెప్పుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

