Vijay Sethupathi: దక్షిణాది సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) నిర్వహించిన ‘సౌత్ అన్‌బాండ్’ (South Unbound) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం దక్షిణాది ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే, ఒకే వేదికపై తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ముగ్గురు అగ్ర కథానాయకులైన తెలుగు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున (King Nagarjuna), తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్ (Mohan Lal).. ఒకే చోట కనిపించి అందరినీ అలరించారు. వీరి కలయిక, వారి మధ్య జరిగిన సరదా సంభాషణలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read- Ravi Teja BMW: అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. మెలోడీతో వచ్చిన మాస్ మహారాజా!
నాగార్జున వయసు రహస్యంపై షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి టాలీవుడ్ కింగ్ నాగార్జున నిత్య యవ్వనాన్ని, వయసు పెరగని రూపాన్ని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు హాజరైన వారితో పాటు, ఆ క్లిప్ చూసిన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. నాగార్జునను ప్రశంసిస్తూ విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘‘నాగార్జున వయసు ఎందుకు పెరగడం లేదో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నా చిన్నప్పుడు నేను ఆయన్ని ఎలా చూశానో.. ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నారు. వయసులో ఏ మార్పూ కనిపించడం లేదు. ముఖ్యంగా, ఆయన జుట్టు కూడా అప్పుడెలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే స్టైలిష్‌గా, అలాగే ఉంది. ఇది నాకు ఓ పెద్ద పజిల్‌గా ఉంది’’ అంటూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
పరిశోధన చేయాలి
విజయ్ సేతుపతి సూచన కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా, విజయ్ సేతుపతి సరదాగా ఒక సూచన కూడా చేశారు. ‘‘నిజంగా చెప్పాలంటే.. యాంటీ ఏజింగ్ పరిశోధనలు (Anti-Aging Research) చేసేవారు కొన్ని రోజుల పాటు నాగ్ సార్‌ని పరిశీలించాలి. ఆయన వయసు పెరగకుండా ఉండే సీక్రెట్‌ను కనిపెట్టి, దాన్ని ఓ మెడిసిన్‌గా తయారుచేస్తే బాగుంటుంది. అప్పుడందరూ ఆయనలానే యంగ్‌గా ఉంటారు. రేపు నాకు మనవళ్లు పుట్టి పెద్దవాళ్లైనా సరే.. ఆయన మాత్రం అలాగే యువకుడిలాగే ఉంటారేమో అనిపిస్తుంది’’ అని విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యలు వేదికపై నవ్వులు పూయించాయి. ఆయన మాటల్లోని నిజాయితీ, సరదా హాస్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read- South Unbound: జియో హాట్‌స్టార్ ఈవెంట్‌లో మెరిసిన ‘బిగ్ బాస్’ బాసులు.. వీడియో వైరల్..
మురిసిపోతున్న కింగ్ నాగ్ ఫ్యాన్స్
విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటుడి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు నాగార్జున అభిమానులకు ఒక గొప్ప కాంప్లిమెంట్‌గా అనిపిస్తున్నాయి. నాగార్జున తన ఫిట్‌నెస్, లుక్ విషయంలో తీసుకునే శ్రద్ధ, దాన్ని దశాబ్దాల పాటు కాపాడుకుంటున్న తీరు మరోసారి రుజువైంది. అందుకే ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మన్మథుడు’ అని పిలుస్తారని ఈ కామెంట్స్ మరోసారి నిరూపించాయి. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ, నాగార్జున నిత్య యవ్వనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ముగ్గురు స్టార్స్ ఒకే వేదికను పంచుకోవడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

