Ravi Teja BMW: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా, కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’.. చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు నిలబడి’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ సాంగ్ అదిరిపోయే మెలోడీ డ్యూయెట్ అనే విషయం.. ఇప్పటికే వచ్చిన ప్రోమో తెలియజేయగా.. ఇప్పుడొచ్చిన ఫుల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ పాటను గమనిస్తే..
Also Read- Bigg Boss Telugu 9: మళ్లీ హౌస్‌మేట్స్‌ని ఇరకాటంలో పెట్టిన బిగ్ బాస్.. ఈసారి ఇద్దరు?
రొమాంటిక్ గీతం
‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే’ అనే పల్లవి.. ఇద్దరు ప్రేమికుల మనోభావాలకు నిజంగానే అద్దం పడుతోంది. అలాగే, ‘నీకు నచ్చిన సంగీతమేంటి? నీ చెప్పుల సవ్వడి… నువ్వు కోరుకున్న దుస్తులేంటి? నీ వెచ్చని కౌగిలి’ వంటి అందమైన పోలికలు, భావాలు పాట డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. తమ ప్రియమైనవారిని గుర్తుచేసుకునేలా ఈ పాట సంగీత ప్రపంచంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సారేగమ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ రొమాంటిక్ గీతం, విడుదలైన కొద్ది క్షణాల్లోనే అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. రవితేజ, డింపుల్ హయతి జంటపై చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్, మనసుకు హత్తుకునే సాహిత్యం, శ్రావ్యమైన సంగీతంతో శ్రోతల హృదయాలను కొల్లగొడుతోంది.
Also Read- Karthi: టఫ్ సినిమాలను చేసినప్పుడే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం.. కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా
ఈ పాట.. ఇంతకు ముందు వచ్చిన పాటలానే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాట ప్రారంభం నుంచే ఆయన పలికించిన స్వరాలు, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ప్రేమలోని గొప్పతనాన్ని, ప్రేమికుల మధ్య ఉండే బాండింగ్‌ను ఆవిష్కరిస్తూ చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. మెలోడీ క్వీన్ శ్రేయ ఘోషాల్, కపిల్ కపిలన్ ఇద్దరూ వారి గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఇక ఈ పాటలో రవితేజ ఎనర్జీ, డింపుల్ హయతి (Dimple Hayathi) గ్లామర్ హైలైట్‌గా నిలిచాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, చూడముచ్చటగా ఉంది. రవితేజ తనదైన స్టైల్లో నర్తించడం, డింపుల్ హయతి అందించిన అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి. రొమాంటిక్ సన్నివేశాలు, రంగులమయమైన లోకేషన్స్, అద్భుతమైన కెమెరా పనితనం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పాట లిరిక్స్, మ్యూజిక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

