Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 94వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 94) కూడా ఫైనలిస్ట్ అయ్యేందుకు టాస్క్‌లు నడుస్తున్నాయి. అయితే ఈసారి చాలా వెరైటీగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. హౌస్‌మేట్స్‌లో వారిలో వారికే గొడవలు పెడుతూ.. ఇరకాటంలో పెడుతున్నారు. ఇంతకు ముందు టాస్క్‌లో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కరిని వద్దని చెప్పాలి.. ఆ ఒక్కరు ఎవరో మీరే తేల్చుకోండి అనే టాస్క్‌లో అందరూ ఇమ్మానుయేల్ (Emmanuel), పవన్ (Demon Pawan) పేర్లు చెప్పారు. కానీ బలైంది మాత్రం సంజన. ఆమె చివరి నిమిషంలో తన మైండ్ సెట్ మార్చుకోవడంతో.. టాస్క్ ఒక్కసారిగా మారిపోయి, ఆమెనే బకరా అయింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ స్ట్రాటజీలను ఫాలో అవుతూ.. వారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టాస్క్‌లు హౌస్‌మేట్స్‌కి ఎంత చిరాకును తెప్పిస్తున్నాయో తెలియాలంటే.. తాజాగా వచ్చిన ప్రోమో చూడాల్సిందే.
Also Read- Karthi: టఫ్ సినిమాలను చేసినప్పుడే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం.. కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు
డబుల్ అవుట్
ఇప్పటి వరకు గ్రూపులో ఉండటంతో టాస్క్‌లు ఆడినా, ఆడకపోయినా.. బాండింగ్స్‌తో నెట్టుకొచ్చారు. కానీ, ఇప్పుడు బాండింగ్స్ కూడా పని చేయవు. చివరి స్టేజ్‌లో ఉన్నారు. హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత నువ్వెవరో? నేనెవరో? అనే మైండ్ సెట్‌తో ఆడుతున్నారు. ఇప్పటి వరకు భరణి (Bharani), సుమన్ శెట్టి (Suman Shetty) మధ్య బాండింగ్ నడుస్తూ వచ్చింది. బుధవారం జరిగిన టాస్క్‌లో వారిద్దరి మధ్య కూడా గొడవ జరిగినట్లుగా ఇప్పటికే వచ్చిన ప్రోమో క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని గమనిస్తే.. ‘డబుల్ అవుట్’ (Double Out) అంటూ బిగ్ వాస్ హౌస్‌మేట్స్‌ని బాగా ఇరకాటంలో పెట్టేశారు. ఇప్పుడు ఒక్కరు కాదు.. ఇద్దరిని టార్గెట్ చేసి, వారి పేర్లు చెప్పాలి. ఈ క్రమంలో హౌస్‌మేట్స్ మధ్య భారీగా ఫైట్ నడుస్తుంది. ముఖ్యంగా సంజన ఇందులో ఎమోషనలైనట్లుగా చూపించారు. ఈ ప్రోమోని గమనిస్తే..
ఇమ్మానుయేల్ హర్ట్..
‘‘నామినేషన్స్ నుంచి బయటపడి, ఫైనలిస్ట్ అవడానికి మరొక ట్విస్ట్ ఉంది. ఈసారి ఒకరిని కాదు, ఇద్దరిని. తర్వాత జరగబోయే యుద్ధం నుంచి పాల్గొనకుండా చేయాలి. ఇంటి సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, ఆ ఇద్దరి పేర్లు చెప్పండి’’ అని బిగ్ బాస్ ట్విస్ట్ వివరాలను తెలిపారు. ఇమ్మానుయేల్ వెళ్లి భరణి, తనూజ, పవన్‌లతో చర్చలు జరుపుతున్నాడు. డైలీ నాకే ఓటు వేస్తే నేను ఏమీ చేయలేను అని అంటున్నాడు. మేము మిడిల్‌లో ఉన్నాము.. మీరు టాప్‌లో ఉన్నారు.. అని తనూజ అంటుంటే.. మీ ఇష్టం అని ఇమ్ము సీరియస్‌గా వెళ్లిపోతున్నాడు. ‘లీస్ట్ స్కోర్‌లో ఉన్నవాళ్లని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తాం.. ఆడే వాళ్లని కదా ఎంకరేజ్ చేస్తాం’ అని కళ్యాణ్‌తో ఇమ్ము అంటున్నాడు. టాప్‌లో ఉన్న ఇద్దరినీ చేస్తామని తనూజ క్లారిటీగా చెబుతుండటంతో ఇమ్ము, పవన్ తమ స్ట్రాటజీని వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంజన, పవన్‌ల మధ్య వాగ్వివాదం నడుస్తోంది. ‘10 వారాల నుంచి నన్నే టార్గెట్ చేస్తున్నారు. గేట్ ఓపెన్ చేయడానికి బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేయండి వెళ్లిపోతాను’ అని సంజన ఎమోషనలవుతుంది. తనూజ మాట్లాడుతుంటే.. ఇమ్మానుయేల్ బల్లపై బాది సీరియస్‌గా వెళ్లిపోతున్నాడు.. ఇది ఈ ప్రోమోలో ఉన్న మ్యాటర్. చూస్తుంటే.. హౌస్‌మేట్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కరిలోని అసలు స్వరూపం బయటపడుతుందనేలా ఈ ప్రోమోకు కామెంట్స్ పడుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

