Karthi: టఫ్ సినిమాలను చేసినప్పుడే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం
Annagaru Vostaru (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Karthi: టఫ్ సినిమాలను చేసినప్పుడే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం.. కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru). డిసెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యా‌నర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందించిన ఈ సినిమాలో కార్తి సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి దర్శకులెందరో హాజరయ్యారు. హీరో సందీప్ కిషన్ ఈ వేడుకకు హాజరై, ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘హిట్ 4’ కోసం వేచి చూస్తున్నా..

‘‘ఈ వేడుకకు వచ్చి నాపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ప్రతి దర్శకుడు, ప్రతి గెస్ట్ మాట్లాడిన మాటలు నా మనసును తాకాయి. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శివ నిర్వాణ, నేను కలిసి గతంలో ఒక సినిమా చేయాలనుకున్నాం. దేవ కట్టా ‘ప్రస్థానం’ నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ. బాబీ గురించి వంశీ పైడిపల్లి ఎప్పుడూ చెబుతుండేవారు. వెంకీ కుడుముల రీసెంట్‌గా ఒక హిలేరియస్ స్క్రిప్ట్ చెప్పాడు. త్వరలో ఆ మూవీ ప్లాన్ చేస్తాం. వివేక్ మంచి రైటర్. ఆయన నేను ఇటీవల కలిశాం.. త్వరలోనే మళ్లీ మీట్ అవుతాం. నా ప్రతి సినిమా రిలీజ్ తర్వాత చిన్మయి నుంచి ఒక పేజ్ మెసేజ్ వస్తుంది. అది రాహుల్ రాసింది. చిన్మయి, రాహుల్ మెసేజ్‌లు నాకు కొరియర్‌లా పంపిస్తుంటుంది. వీళ్లంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. శైలేష్ నాతో ‘హిట్ 3’ సినిమాలో చిన్న కేమియా చేయించారు. అందులో నేను చెప్పిన ఒక్క డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ చిన్న సీన్‌కు చాలా బ్యాక్ స్టోరీ రాశారు శైలేష్. మా కాంబోలో వస్తున్న ‘హిట్ 4’ కోసం నేను ఎంతగానో వేచి చూస్తున్నాను. సందీప్ నన్ను బాగా పొగిడి ఇబ్బంది పెట్టేశాడు. కృతి శెట్టి సినిమా చేసే టైమ్‌లో నా అభిమాని అని చెప్పింది. ఈ సినిమా కోసం తను ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేసింది. నలన్ కుమారస్వామి స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్‌ను అసలు ఊహించలేకపోయాను. కృతి ఆ పాత్రను ఎలా చేస్తుందా? అని అనుకున్నాను. కానీ కృతి ఆ పాత్రలో అద్భుతంగా నటించింది. తను చాలా మంచి డ్యాన్సర్. నా అభిమాని అని చెప్పింది కదా అని.. డ్యాన్స్ విషయంలో ఫేజ్ 2 చాలని చెప్పాను. చాలా అద్భుతంగా పాటలు వచ్చాయి.

Also Read- Akhanda 2: ఎట్టకేలకు ‘అఖండ 2’ విడుదల తేదీ చెప్పిన మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మనకు సూపర్ హీరోస్..

ఇక ‘అన్నగారు వస్తారు’ సినిమా గురించి చెప్పాలంటే.. మనకు మన హీరోలంటే ఎంతో అభిమానం. మీరు నన్ను అభిమానిస్తే.. నేను నాకు ఇష్టమైన హీరోను అభిమానిస్తాను. ఆ అభిమానం ఒక దశ దాటితే.. భక్తి అవుతుంది. ఈ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ నలన్ ఈ సినిమాను రూపొందించారు. ఈ కథకు ఒక సూపర్ హీరో లాంటి హీరో కావాలి. సూపర్ హీరో అనగానే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్‌లా ఎందుకు ఉండాలి. మన కల్చర్‌లోనే ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాను, రాజకీయాలను, ప్రజా జీవితాలను మార్చేశారు. మనందరికీ మన హీరోలే డెమీ గాడ్స్. వినోదంతో పాటు మనకు ఉపయోగపడే పని వాళ్లు తెరపై చేస్తే అది చాలా స్పెషల్‌గా భావిస్తుంటాం. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి వారు మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. నలన్‌కు తెలుగు దర్శకుల్లో ఇందరు అభిమానులు ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన 8 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఒక ఊహా ప్రపంచంలో ఈ స్టోరీ జరుగుతుంటుంది.

Also Read- Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!

ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ పాత్ర చేశా

ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇదొక సవాల్ లాంటి సినిమా. ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ పాత్ర చేశాను. ఇలాంటి టఫ్ సినిమాలను చేసినప్పుడే కదా.. మనం నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం అనిపించింది. నాకు తెలిసి బాగానే నటించానని అనుకుంటున్నాను. అందరికీ ఈ మూవీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా మరోసారి చేయడం కష్టం. కొత్తదనం లేని సినిమాలు చేసి, మీ ముందుకు రావాలంటే భయపడతాను. ‘సత్యం సుందరం’ సినిమా వచ్చినప్పుడు ఆ మూవీని తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగా సెలబ్రేట్ చేశారో నాకు తెలుసు. ఆ క్రమంలో మరో డిఫరెంట్ సినిమాను తీసుకొస్తున్నామని చెప్పగలను. నిర్మాత జ్ఞానవేల్ ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. నా తరుపున, అన్నయ్య సూర్య తరుపున తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని కార్తి చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!