Akhanda 2: నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) విడుదలకు సంబంధించి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. పలు ఆటంకాల తర్వాత, ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఊహించని అవాంతరాల కారణంగా చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు ఉన్న పాత బకాయిల కారణంగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అడ్డుగా నిలబడటంతో, అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. ఈ అడ్డంకితో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
సమస్యల సుడిగుండం దాటుకుని..
ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ సమావేశమై ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో ఈ పాత బకాయిల సమస్యకు తెరపడింది. అయినప్పటికీ, అనుకున్న తేదీకి విడుదల కాకపోవడంతో… డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి మరో కొత్త సమస్య ఎదురైంది. దీంతో, ‘అఖండ 2’ విడుదల ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఈ గందరగోళం డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఇతర చిన్న సినిమాలపై కూడా ప్రభావం చూపింది, ఆ చిత్రాల విడుదల తేదీలు కూడా అయోమయంలో పడ్డాయి.
Also Read- Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!
అన్ని అడ్డంకులనూ దాటుకుని..
అయినప్పటికీ, నందమూరి అభిమానుల నిరీక్షణ ఫలించింది. అన్ని ఆటుపోట్లను విజయవంతంగా దాటుకుని, ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ ఫైనల్‌గా పోస్టర్ ద్వారా ధృవీకరించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం ప్రీమియర్స్ డిసెంబర్ 11వ తేదీనే ఉండబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ప్రకటనతో నిరాశలో ఉన్న నందమూరి అభిమానులు ఒక్కసారిగా ఉప్పొంగిపోయారు. ఆలస్యంగానైనా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందనే సంతోషంతో, అభిమానులు ఇప్పుడు సినిమా బుకింగ్‌లపై దృష్టి సారించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేసింది. డిసెంబర్ 5న కనుక వస్తే.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టి.. హిస్టరీ క్రియేట్ చేసేది. ఇప్పటికైనా, ఈ సినిమాపై ఉన్న బజ్ మాత్రం ఏం తగ్గలేదు. ఎప్పుడు వచ్చినా హిట్ పక్కా అనే కంటెంట్ ఇందులో ఉన్న విషయం తెలియంది కాదు. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ ఆశించినట్లుగానే, ‘అఖండ 2: తాండవం’ వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
All set for the Divine Destruction at the box office 🔥
Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱
BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

