Jayasudha: పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!
Jayasudha and Pawan Kalyan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!

Jayasudha: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)పై సహజ నటి జయసుధ (Jayasudha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె రాజమండ్రి పర్యటనలో ఉన్నారు. హర్షకుమార్ ఇంట్లో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న జయసుధ.. మీడియాతో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పనితీరుపై ఏం కామెంట్స్ చేస్తారని మీడియా జయసుధను ప్రశ్నించగా.. ‘ఆయన సినిమాలలో ఉన్నప్పుడే తలవంచలేదు.. ఇక రాజకీయాల గురించి చెప్పేదేముంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయసుధ నటిగానే కాకుండా రాజకీయంగానూ సుపరిచితురాలే. ఈ మధ్య ఆమె వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కుమారుడు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. అదేం లేదని, జగన్‌ని కలవడానికి వెళితే, అలా కండువా కప్పారని క్లారిటీ ఇచ్చారు.

Also Read- Akhanda 2: బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు ఆయన బిడ్డకు రూ. 10 కోట్లా! ఇలా కూడా ఉంటుందా!

ఇది నా వ్యక్తిగత అభిప్రాయం

పవన్ కళ్యాణ్ గురించి జయసుధ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్‌కు ఒక సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. అందులో యాక్టింగ్ ఏమీ ఉండదు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో మార్పేం లేదు. ఆయన సినిమాలలోనూ ఎవరికీ ఎప్పుడూ తలవంచలేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. అవి లేకపోతే ఇంత స్టడీగా ఉండలేరు. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయేవారు. కానీ వెళ్లలేదు కదా. ఆయన పడిన కష్టం, సిన్సియారిటీనే ఇంత వరకు తీసుకొచ్చాయి. దీనికి అందరం ఆయనను అభినందించాలి. ఆర్టిస్టులం మధ్యలో మనకెందుకులే ఈ తలనొప్పి, వీళ్లతో ఎక్కడ పడతాం అని వెళ్లిపోయి ఉండవచ్చు. ఇప్పటికైనా ఆయన సినిమాలలో యాక్ట్ చేస్తానంటే.. ఎంతైనా, ఏదైనా ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అవన్నీ వదలుకుని, ఇటువైపు వచ్చి నిలబడటం మాత్రం చాలా గొప్ప విషయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Tarun Bhascker: తరుణ్ భాస్కర్ అలా అనేశాడేంటి భయ్యా .. సీరియస్ అయిన ఫిలిం జర్నలిస్ట్.. ఎందుకంటే?

బెస్ట్ ఛాయిస్ ఆమెనే..

సినిమా విషయాలకు వస్తే.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె బిజీబిజీగా ఉన్నారు. తల్లి, అత్త వంటి పాత్రలకు బెస్ట్ ఛాయిస్‌గా జయసుధ పేరే వినిపిస్తోంది. ఇప్పుడున్న ఎంతో మంది స్టార్ హీరోలకు ఆమె అమ్మగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా ‘బాలు’ సినిమాలో అమ్మ తరహా పాత్రనే పోషించారు. తన ప్రియురాలి మదర్ అయినప్పటికీ, తను చనిపోవడంతో, ఆ ఇంటికి ఒక కొడుకుగా పవన్ కళ్యాణ్ మారిపోతాడు. ఆ సినిమా ఆశించనంతగా విజయం సాధించకపోయినా, పాత్రల పరంగా ప్రతి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జయసుధ తాజాగా పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆమె వార్తలలో హైలెట్ అవుతున్నారు. కొన్నాళ్లుగా ఆమె పేరు పెద్దగా ఇండస్ట్రీలో వినిపించడం లేదనే విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!