Tarun Bhascker: తరుణ్ భాస్కర్ ప్రధాన్ పాత్రలో నటించి ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓ సందర్భంలో ఫిలిం జర్నలిస్ట్ మూర్తి తరుణ్ భాస్కర్ ను ఏదో అడగడానికి ప్రయత్నించారు. అయితే ఆయన స్పందిస్తూ.. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ సార్ అని నవ్వుతూ అన్నారు. దానికి మూర్తి స్పందిస్తూ చివరి సారి కూడా మీరు ఇలాగే అన్నారు, దీంతో చాలామంది దానిని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ఇది చాల బ్యాడ్ బిహేవియర్ సార్ అంటూ కొపగించుకున్నారు. అక్కడితో ఆగకుండా మేము అనలేమా మిమ్మల్ని ప్లాప్ దర్శకుడు, ప్లాప్ హీరో అంటూ ఫైర్ అయ్యారు. దీంతో తరుణ్ భాస్కర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక సారి మీరు ఇదే మాట నోరు జారారు అపుడు అన్నందుకు ఇప్పటివరకూ ట్రోల్ చేస్తున్నారు. అంటూ తరుణ్ పై మండిపడ్డారు దీంతో మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. దీంతో తరుణ్ తగ్గి ఆ జర్నలిస్ట్ దగ్గరకు వచ్చి బుజ్జగించాల్సి వచ్చింది. దీంతో మూర్తి శాంతించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి నటుడిగా పూర్తి నిడివి కామెడీ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంలో తరుణ్ భాస్కర్ ‘అంబటి ఓంకార్ నాయుడు’ అనే ఆసక్తికరమైన పాత్రను పోషిస్తున్నారు. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓంకార్ నాయుడు ఒక చేపల వ్యాపారి. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని చూసే భర్తగా, అమాయకత్వం, అహంకారం మేళవింపుతో ఈ పాత్ర ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.
Read also-Champion Song: రోషన్ ‘ఛాంపియన్’ నుంచి ‘సల్లంగుండాలి’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి మరి..
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన ఈషా రెబ్బా ‘కొండవీటి ప్రశాంతి’ పాత్రలో నటించారు. క్రమశిక్షణతో, స్వతంత్రంగా ఎదగాలని కోరుకునే ప్రశాంతిగా ఆమె నటన ఆకట్టుకోనుంది. సంగీత దర్శకుడు జై క్రిష్ అందించిన స్వరాలు, దీపక్ యెరగర సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక బలాలుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు సంయుక్తంగా ఎస్ ఒరిజినల్స్ మరియు మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్… తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్, సహజమైన యాసతో కూడిన సంభాషణలతో (ముఖ్యంగా క్రికెట్ అంశాలపై) ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుటుంబ సంబంధాలలో హాస్యాన్ని, సామాజిక సందేశాన్ని మేళవించిన ఈ చిత్రం జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Director #TharunBhascker Apologised and touched GA Murthy's feet!! pic.twitter.com/nrzxtwAdYC
— Whynot Cinemas (@whynotcinemass_) December 8, 2025

