Rowdy Janardhan: ఆ సినిమాకు సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే?
vijay-setupathi(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rowdy Janardhan: ‘రౌడీ జనార్ధన్’ సినిమాకు విజయ్ సేతుపతి తీసుకునేది తెలిస్తే షాక్ అవుతారు!.. విలన్ కోసం అంతా?

Rowdy Janardhan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. తాజాగా దిల్ రాజు నిర్మాతగా రౌడీ జనార్ధన్ అనే టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దిరి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా. అయితే ఈ చిత్రంతో విలన్ పాత్రలో నటిస్తున్నారు. అందులో ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే ఈ సినిమాలో విలన్ గా చేయడానికి విజయ్ సేతుపతి దాదాపు రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నార్మాణ సంస్థ సిద్దంగా ఉంది. టాలీవుడ్ లో విలనిజం కోసం ఇన్ని కోట్లు ఖర్చుపెట్టడం ఇది మొదటి సారని సినీ వార్గాల్లో చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని అమాంతం పెంచేసింది.

Read also-Champion Song: రోషన్ ‘ఛాంపియన్’ నుంచి ‘సల్లంగుండాలి’ సాంగ్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి మరి..

‘రౌడీ జనార్ధన్’ టైటిల్ ఖరారు!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ పై నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాకు ‘రౌడీ జనార్ధన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా టైటిల్ వింటుంటేనే, విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక మాస్ ఎంటర్‌టైనర్ సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దేవరకొండ, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకునే కీర్తి, ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Read also-LIK Release: ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా!.. వచ్చేది ఎప్పుడంటే?

విజయ్ సేతుపతికి భారీ పారితోషికం

అయితే, ఈ ప్రాజెక్ట్‌లోని అత్యంత ముఖ్యమైన సంచలనాత్మకమైన అంశం.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ముఖ్య ప్రతినాయకుడి పాత్ర పోషించబోతుండడం! తెలుగులో ఇప్పటికే ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సేతుపతి, ఇప్పుడు విజయ్ దేవరకొండకు ధీటైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత కారణంగానే, నిర్మాత దిల్ రాజు ఆయనకు ఏకంగా రూ.20 కోట్ల భారీ పారితోషికం చెల్లించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తం, తెలుగు సినీ పరిశ్రమలో ఒక విలన్‌కు దక్కిన అత్యంత భారీ పారితోషికాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఒకవైపు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, మరోవైపు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు మరియు మైండ్‌గేమ్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో, ఈ అద్భుతమైన నటీనటుల కలయికలో రాబోతున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమా, 2026లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వివరాలు, దర్శకుడి పేరు ఇతర సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. విజయ్ సేతుపతి ఇప్పటికే పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

Just In

01

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!