LIK Release: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా!..
lik-release(X)
ఎంటర్‌టైన్‌మెంట్

LIK Release: ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా!.. వచ్చేది ఎప్పుడంటే?

LIK Release: యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాధన్ నటించిన మోస్ట్ అవేటెడ్ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) విడుదల మరోసారి వాయిదా పడిందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తెల చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా ప్రకటించిన డిసెంబర్ 18 విడుదల తేదీ నుండి ఈ సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ వాయిదా నిర్ణయం వెనుక ముఖ్యంగా రెండు బలమైన కారణాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నిర్ణయం సినిమా వసూళ్లపై సానుకూల ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read also-Bigg Boss9 Telugu: అలా చెప్పడంతో ఇమ్మానుయేల్‌పై ఫైర్ అయిన భరణి.. ఈ క్లాష్ ఏంది భయ్యా..

అవతార్ కారణమా..

‘అవతార్’ (Avatar: Fire and Ash) నుండి పోటీని నివారించడానికి కేవలం ఒక్క రోజు వ్యవధిలో, అంటే డిసెంబర్ 19న, జేమ్స్ కామెరూన్ రూపొందించిన భారీ అంతర్జాతీయ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఆ స్థాయిలో ఉన్న సినిమా పోటీని ఎదుర్కోవడం కంటే, తమ సినిమాకు సరైన విడుదల విండోను ఎంచుకోవడం తెలివైన నిర్ణయంగా చిత్ర బృందం భావించింది. ప్రదీప్ ‘డ్యూడ్’కు మంచి గ్యాప్ కోసం ఇటీవలే, ప్రదీప్ రంగనాధన్ నటించిన మరో సినిమా ‘డ్యూడ్’ (Dude) విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఆ సినిమా థియేట్రికల్ రన్‌కు పూర్తి గ్యాప్ ఇవ్వడం ద్వారా, ప్రేక్షకులు తదుపరి సినిమాను ఫ్రెష్‌గా చూడగలుగుతారని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Read also-Kriti Height: హీరోల హైట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్.. అంటే మహేష్ బాబు కూడా!

వాలెంటైన్స్ వీక్ టార్గెట్?

వాయిదా తర్వాత ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా కోసం చిత్ర బృందం కొత్తగా ఫిబ్రవరి 12/13 వాలెంటైన్స్ వీక్ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా పరిశ్రమ వర్గాల నుండి సమాచారం అందుతోంది. లవ్ స్టోరీకి సరైన టైం ఈ సినిమా టైటిల్, పోస్టర్‌లు చూస్తే ఇది పూర్తిస్థాయి లవ్ స్టోరీగా అర్థమవుతోంది. లవర్స్ డే అయిన వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాను విడుదల చేస్తే, యువ ప్రేక్షకులను భారీగా థియేటర్లకు రప్పించవచ్చని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే వీక్ లాంగ్ వీకెండ్‌తో కలిస్తే, సినిమాకు అదనపు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద, పోటీ లేని మంచి రిలీజ్ డేట్ కోసం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం, సినిమాకి కమర్షియల్‌గా ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కొత్త అధికారిక విడుదల తేదీ గురించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా దీపావళి రేస్ నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ప్రకటించిన డేట్స కూడా మారనున్నాయి. దీంతో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు