Akhanda 2: బాలయ్య బిడ్డకు రూ. 10 కోట్లా! ఇలా కూడా ఉంటుందా!
Akhanda 2 Team (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2: బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు ఆయన బిడ్డకు రూ. 10 కోట్లా! ఇలా కూడా ఉంటుందా!

Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) విడుదల ఆఖరి నిమిషంలో కోర్టు స్టేతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇంకో గంటలో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు పడతాయనగా, ఈ మూవీని ఆపడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) నిర్మాతల పాత బకాయిల వ్యవహారం ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ల చిట్టా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, ‘అఖండ 2’ కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారీగా రెమ్యునరేషన్లు చెల్లించారట. బాలకృష్ణకు రూ. 40 కోట్లు, దర్శకుడు బోయపాటి శ్రీనుకు రూ. 30 కోట్లు, సంగీత దర్శకుడు థమన్‌కు రూ. 6 కోట్లు, కథానాయిక సంయుక్తకు రూ. 2 కోట్లు పారితోషకాలుగా నిర్ణయించారని తెలుస్తోంది.

Also Read- Jr NTR: చిరు బాటలో జూనియర్ ఎన్టీఆర్.. అనుమతి లేకుండా పేరు, ఫొటో వాడకూడదంటూ..!

కుమార్తెకు రూ. 10 కోట్లు ఎందుకు?

ఈ మొత్తం లెక్కలు ఒక ఎత్తయితే, బాలకృష్ణ అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం మరొకటి ఉంది. ఈ సినిమాకు బాలయ్య డేట్స్ అడ్జస్ట్ చేసినందుకు గాను, ఆయన కుమార్తెకు ఏకంగా రూ. 10 కోట్లు చెల్లించారనే వార్త ఇప్పుడు గుప్పుమంది. నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోకు రూ. 40 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం సాధారణమే అయినప్పటికీ, కేవలం ‘డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు’ లేదా ఒక మేనేజర్ తరహా పాత్రకు రూ. 10 కోట్లు చెల్లించడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా, ఇతర అగ్ర హీరోల మేనేజర్లకు కూడా ఇంత పెద్ద మొత్తం పారితోషకంగా ఇవ్వడం జరగదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా సడెన్‌గా ఆగిపోవడంతో.. కాంబినేషన్ సెట్ చేయడం కోసం ఇంతగా ఖర్చు చేయడం ఎందుకు? సినిమాను రిలీజ్ చేయలేక చేతులు ఎత్తేయడం ఎందుకు అనేలా? ఓ వర్గం సోషల్ మీడియాలో నిర్మాతలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Also Read- Rajasekhar: యాంగ్రీమ్యాన్ రాజశేఖర్‌కు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!

నిజంగా బాలయ్య ఒప్పుకున్నాడా?

‘ఒక్క రెమ్యునరేషన్లకే ఇంత మొత్తం ఖర్చు చేస్తే, ఇక మిగిలిన నిర్మాణ వ్యయం ఎంత ఉంటుంది? అందుకే నిర్మాతలు ఇంతగా అప్పుల్లో కూరుకుపోయి, చివరికి సినిమాను ఆపే పరిస్థితి తెచ్చుకున్నారా?’ అనేలా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ అంచనాలు, అనూహ్య పారితోషకాల అంశంపై నిర్మాతలు, బాలకృష్ణ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. అయితే, తన బిడ్డ కోసం బాలకృష్ణ ఇలాంటి ప్రతిపాదనకు ఒప్పుకోవడంపై నందమూరి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఎందుకంటే, నిర్మాతల శ్రేయస్సు కోరే నటుడాయన. ఒక్కసారి ఓకే అన్నాడంటే, దర్శకుడు చెప్పినట్లుగా చేసుకెళ్లడమే తప్పితే.. మధ్యలో వేలు పెట్టడాలు వంటివి ఆయన చేయడు. అలాంటి హీరోపై ఇలాంటి వార్త రావడం మాత్రం విడ్డూరంగానే అనిపిస్తుంది. చూద్దాం మరి.. దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు