Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల ముంగిట ఊహించని షాక్‌లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే అనేక అవాంతరాలను దాటి, ఎట్టకేలకు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు, తెలంగాణ హైకోర్టు తీర్పు రూపంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. ఈ నిర్ణయం చిత్రయూనిట్‌కు, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
Also Read- Akhanda 2: రిలీజ్‌కు ముందు మరో టీజర్ వదిలారు.. ఈ టీజర్ ఎలా ఉందంటే?
అంచనాలన్నీ తారుమారు
వాస్తవానికి, భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధిస్తుందని సినీ వర్గాలు బలంగా విశ్వసించాయి. ఈ అంచనాలకు తగ్గట్టే, తెలంగాణ ప్రభుత్వం చిత్ర బృందానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు అనుమతి ప్రకారం, డిసెంబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి అవకాశం దక్కింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు. దీని ద్వారా మొదటి రోజే అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని చిత్ర బృందం ప్లాన్ చేసుకుంది. అంతేకాకుండా, సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు, అంటే డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండేలా జీవోను జారీ చేశారు. ఈ మూడు రోజులలో, మల్టీప్లెక్సులలో టికెట్ ధరపై అదనంగా రూ. 100 చొప్పున, అలాగే సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై అదనంగా రూ. 50 చొప్పున పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరల పెంపు ద్వారా దాదాపు రూ. 5 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు అదనపు వసూళ్లు లభిస్తాయని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.
Also Read- Save the Tigers Season 3: టైగర్స్ వస్తున్నారు.. ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ గ్లింప్స్ చూశారా?
తెలంగాణలో నార్మల్ రేట్స్‌కే..
అయితే, ఈ జీవోను హైకోర్టు రద్దు చేయడంతో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో ‘అఖండ 2’ సినిమా నార్మల్ రేట్స్‌కే విడుదలవుతోంది. ఈ కోర్టు తీర్పుపై చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో వచ్చిన ఈ షాక్ కలెక్షన్లపై కొంత ప్రభావం చూపినప్పటికీ, బాలకృష్ణ-బోయపాటి కాంబోపై ఉన్న నమ్మకంతో సినిమా కచ్చితంగా అఖండ విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు మిగతా పెద్ద సినిమాల విడుదలకు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో టికెట్ల ధరల నియంత్రణపై సినీ పరిశ్రమ మరింత దృష్టి పెట్టాలని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. సినిమాకు హైప్ ఎంత ఉన్నా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే విడుదల జరగాలని కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

