Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)ల కాంబినేషన్‌లో డివైన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సమస్యలు చుట్టుముట్టడంతో అనూహ్యంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర అన్ని సమస్యలను పరిష్కరించుకుని, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఒక రోజు ముందే అంటే, డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన సమయంలో.. మేకర్స్ ఫ్యాన్స్ కోసం తాజాగా ‘గ్రాండ్ రిలీజ్ టీజర్’ (Akhanda 2 Grand Release Trailer) అంటూ మరో టీజర్ వదిలారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..
Also Read- Vijay Sethupathi: కింగ్ నాగార్జున వయసుపై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
దిష్టి తీసే సన్నివేశం మాత్రం హైలెట్
‘లోక క్షేమం కోరావ్.. ఇక నీ క్షేమం ఆ శివుని ఆధీనం’ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూది పండును ఆపేది’ అనే డైలాగ్ వస్తుంటే.. స్ర్కీన్‌పై కనిపించే సన్నివేశాలకు గూస్‌బంప్స్ రావడం పక్కా. ఇక పాపకు దిష్టి తీసే సన్నివేశం మాత్రం హైలెట్ అని ఒప్పుకోవాల్సిందే. ‘నరదిష్టి, పరదిష్టి, సమస్య దిష్టి నశ్రిహి’ అంటూ బాలయ్య దిష్టి తీయడం చూస్తే.. థియేటర్లలో పూనకాలే. ఆ సన్నివేశం తర్వాత చూపించిన శివతాండవం, ఆంజనేయుని ఆగమనం.. అబ్బో చెప్పే కంటే చూస్తేనే బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రిలీజ్ టీజర్ చూసేయండి.
Also Read- Ravi Teja BMW: అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. మెలోడీతో వచ్చిన మాస్ మహారాజా!
సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్‌లో..
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ’ ఘన విజయం సాధించి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా ఈ మధ్య బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ పెంచుతూనే ఉంది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్‌తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుందనే ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయని, ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ అందించబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రేక్షకులు బాలకృష్ణను మూడు విభిన్న గెటప్‌లలో ఇందులో చూడబోతున్నారనే విషయం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. చూద్దాం.. మరి ఈ అంచనాలు ఈ సినిమాను ఏ స్థాయిలో నిలబెడతాయో..
THE UNSTOPPABLE DIVINE ROAR 🔥🔥🔱#Akhanda2 GRAND RELEASE TEASER out Now!
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6In theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna… pic.twitter.com/dVDff9JDD9— 14 Reels Plus (@14ReelsPlus) December 10, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

