Samantha and Raj: సమంత-రాజ్‌ల అరుదైన ఫొటోతో రాజ్‌ సోదరి
Samantha with Raj Family (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్‌ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!

Samantha and Raj: టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu), ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ‘భూత శుద్ధ వివాహ’ పద్ధతిలో అత్యంత ఆధ్యాత్మికంగా జరిగిన వీరి పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి ఫోటోలు అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా, పెళ్లి తర్వాత కొన్ని రోజులకే, రాజ్‌ నిడిమోరు సోదరి (Raj Nidimoru Sister) షీతల్ నిడిమోరు తమ కుటుంబానికి చెందిన ఒక అరుదైన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది మెహందీ వేడుక సమయంలో తీసిన ఫ్యామిలీ ఫోటో అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నూతన వధువు సమంత, చేతులకు అందమైన మెహందీ పెట్టుకుని, చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. పక్కనే రాజ్ నిడిమోరు సాధారణ దుస్తుల్లో ప్రశాంతంగా ఉన్నారు. ఈ ఫొటోలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా నవ్వుతూ కనిపించడం గమనించవచ్చు.

Also Read- Jinn Movie: సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ఆడపడుచు హృదయపూర్వక స్వాగతం

ఈ ఫొటోను షేర్ చేస్తూ షీతల్ (Sheetal Nidimoru) రాసిన క్యాప్షన్ అభిమానుల హృదయాలను కదిలించింది. ‘Love shared is love multiplied. #shatamaanambhavati’ (ప్రేమ పంచితే అది రెట్టింపవుతుంది. శతమానంభవతి) అంటూ రాస్తూ, సమంత (Samantha)ను హృదయపూర్వకంగా కుటుంబంలోకి ఆహ్వానించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘Harmony is the real blessing’ అని పేర్కొనడం ద్వారా సమంతకు నిడిమోరు కుటుంబం ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం పలికిందో స్పష్టమవుతోంది. షీతల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత సమంతకు సంబంధించి వచ్చిన పోస్ట్‌ని సమంత అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Also Read- Peddi: 150 మిలియన్ల క్లబ్‌లోకి ‘చికిరి చికిరి’.. వృద్ధి సినిమాస్ నిర్మాత సంచలన పోస్ట్

జాగ్రత్తలు చెబుతున్న అభిమానులు

షీతల్ పోస్ట్‌పై సమంత అభిమానులు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ‘సామ్‌ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని ఒకరు, ‘దయచేసి సామ్‌ను జాగ్రత్తగా చూసుకోండి’ అని మరొకరు కామెంట్ చేయడం ద్వారా సమంత పట్ల అభిమానులు చూపే ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాను ముంచెత్తారు. 2024 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ జంట తమ బంధం గురించి పెదవి విప్పలేదు. ఇద్దరూ ప్రైవేట్‌గా వివాహం చేసుకోవడం ద్వారా తమ ప్రేమ కథకు ముగింపు పలికి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఈ అన్‌ సీన్ ఫొటో, వారి ప్రైవేట్ వేడుకల యొక్క మరో అందమైన భాగాన్ని అభిమానులకు పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క