Jinn Movie: ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కచ్చితంగా ఏదో ఒక వైవిధ్యత ఆ సినిమాలో ఉండాల్సిన పరిస్థితి నేడు ఉంది. లేదంటే ఓటీటీలకే పరిమితం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త వైవిధ్యభరితంగా రూపుదిద్దుకున్న చిత్రాలన్నీ మంచి సక్సెస్‌ను సాధించాయి. కథలో స్టఫ్ ఉంటే చాలు.., కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాతో ఓ డిఫరెంట్ జానర్‌లో ‘జిన్’ (Jinn Movie) అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. చిన్మయ్ రామ్ (Chinmay Ram) దర్శకత్వంలో సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ (Nikhil M. Gowda) నిర్మిస్తున్న చిత్రం ‘జిన్’. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. అమిత్ రావ్ (Ammith Rao) హీరోగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 19న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
Also Read- Bigg Boss Telugu 9: పవన్, భరణి, సుమన్ ఔట్.. ఇక మిగిలింది ఆ ముగ్గురే!
ప్రేక్షకులు అసలు ఊహించని విధంగా
వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ కానుందని మేకర్స్ చెబుతున్నారు. కంటెంట్ పరంగానే కాకుండా, సాంకేతికంగానూ ఈ సినిమా.. ప్రేక్షకులు అసలు ఊహించని విధంగా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ సరికొత్త ఫీల్‌ని ఇస్తుందని మేకర్స్ ఈ అప్డేట్‌లో చెప్పారు.
Also Read- Mowgli Producer: సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌పై బండి సరోజ్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పిన నిర్మాత!
‘జిన్’ అనే టైటిల్ ప్లస్ పాయింట్
ఇంకా దర్శకనిర్మాతలు ఈ సినిమా గురించి చెబుతు.. ఈ సినిమాకు ‘జిన్’ అనే టైటిల్ ప్లస్ పాయింట్ కానుంది. కథనే కాదు టైటిల్‌లో కూడా వైవిధ్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అవుతోందని తెలిపారు. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశామని, ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గలేదని అన్నారు. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయని, ఈ మూవీ సక్సెస్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటారు.. కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ మూవీ అవుతుందని, సినిమా చూసిన వారంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారని వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేకర్స్ వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

