Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 95వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 95) కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు, అంతే ఆసక్తికరమైన గేమ్స్ నడిచాయి. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌లో ఒక్కొక్కరు గేమ్స్ ఆడడానికి తగిన స్కోర్ లేకపోవడంతో.. బిగ్ బాస్ వారిని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో ముందుగా సుమన్ శెట్టి (Suman Shetty) తన దగ్గర ఉన్న పాయింట్స్ సంజనకు ఇచ్చేసి, పోరు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత డిమోన్ పవన్ (Demon Pavan) లిస్ట్‌లో లాస్ట్ ఉన్నాడు. దీంతో అతడిని కూడా బిగ్ బాస్ తప్పించారు. ఆ తర్వాత ఎవరితో ఆడకూడదని అనుకుంటున్నారో.. లీస్ట్‌లో నుంచి ఒకరిని తీసేయమని అనగానే ఎక్కువ ఓట్స్ భరణి (Bharani)కి పడటంతో, అతను కూడా ఈ పోరు నుంచి తప్పుకుని పక్కన ఉండాల్సి వచ్చింది. దీంతో సెకండ్ ఫైనలిస్ట్ రేసులో కేవలం ముగ్గురే ఉన్నారనేది తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. ఈ ప్రోమోస్‌ను గమనిస్తే..
Also Read- Peddi: 150 మిలియన్ల క్లబ్‌లోకి ‘చికిరి చికిరి’.. వృద్ధి సినిమాస్ నిర్మాత సంచలన పోస్ట్
ఇదే చివరి అవకాశం
హౌస్ డెసిషన్ అంటూ వచ్చిన ప్రోమోలో.. ‘పవన్, లీడర్ బోర్డులో అందరికంటే లీస్ట్ స్కోర్ ఉన్న కారణంగా, ఈ పోరులో నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ పోరులో మీరు సంపాదించిన స్కోర్‌లో సగం ఇంటి సభ్యులలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది’ అని బిగ్ బాస్ చెప్పగానే.. ‘తనూజ’ పేరు చెప్పాడు పవన్. దీంతో తనూజ టాప్‌లోకి, సంజన రెండో ప్లేస్‌లోకి వచ్చారు. మూడు, నాలుగు ప్లేస్‌లలో ఇమ్మానుయేల్, భరణి ఉన్నారు. ‘ఇంటి సభ్యులందరూ కలిసి, తర్వాత నేను ఇచ్చే యుద్ధంలో పాల్గొనకుండా ఉండటానికి ఒక సభ్యుడిని ఎన్నుకోవాలి. ప్రేక్షకులను కలుసుకోవడానికి, ఓట్ అప్పీల్ చేసుకోవడానికి కూడా ఇదే చివరి అవకాశం’ అని బిగ్ బాస్ చెప్పారు. కొన్ని డిస్కషన్స్ అనంతరం బిగ్ బాస్ అడగగానే.. ప్రతిసారి ఇటు వైపు నుంచే మొదలు పెడుతున్నాం కదా.. ఈసారి అటు నుంచి స్టార్ట్ చేయండని భరణి అనగానే.. ఆ చివర కళ్యాణ్ పక్కన కూర్చుని ఉన్న తనూజ లేచి వెళ్లిపోతుంది. మొత్తంగా చూస్తే.. తండ్రీకూతుళ్లుగా బాండింగ్ ఉన్న భరణి, తనూజకు మధ్య ఈ టాస్క్‌తో విభేదాలు తలెత్తయనేది తెలుస్తోంది.
Also Read- Mowgli Producer: సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌పై బండి సరోజ్ షాకింగ్ కామెంట్స్.. సారీ చెప్పిన నిర్మాత!
ఆడియెన్స్‌కి అడ్డంగా దొరికేసిన తనూజ..
‘కాంపిటేషన్ హీట్’ అంటూ వచ్చిన ప్రోమోలో ఫైనలిస్ట్ అవడంలో భాగంగా, పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ‘బ్యాలెన్స్ అండ్ స్టడీ’.. అని బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో చెబుతున్నారు. అయితే ఈ గేమ్ అంత ఈజీగా లేదనేది ఇమ్మానుయేల్ ఆడుతున్న తీరు చూస్తుంటే తెలుస్తుంది. డిమోన్ పవన్ ఈ పోరుకు సంచాలక్‌గా ఉన్నారు. ఇక్కడ కూడా తనూజ నోరు వేసుకుని పడుతుంది తప్పితే.. తన గేమ్ గురించి ఆలోచించడం లేదు. ఇమ్మానుయేల్ ఇక గేమ్ అయిపోతుంది అనుకున్న సమయంలో అతనికి ఝలక్ తగిలింది. ఈ గేమ్‌లో విన్నర్ ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ‘ట్రూత్ బాంబ్స్’ అంటూ వచ్చిన ప్రోమోలో లీడర్ బోర్డులో టాప్‌లో ఉన్న తనూజను రెండో ప్లేస్‌లో ఉన్న ఇమ్ము, మూడో ప్లేస్‌లో ఉన్న సంజనలలో ఒకరిని, ఎవరు ప్రేక్షకులను ఎదుర్కొవాలన్నది మీరే నిర్ణయించండి అనగానే, ఆమె సంజన పేరు చెప్పారు. వారిద్దరూ ప్రేక్షకుల దగ్గరకు రాగా, అందులో సంజనకు తక్కువ ఓట్స్ పడటంతో ఆమె వెంటనే ఇంటిలోకి వెళ్లిపోయింది. ఇక తనూజకు మాత్రం ప్రేక్షకులు కాళరాత్రి అంటే ఏంటో చూపించారు. ఆమెకు ప్రేక్షకులు సంధించిన ప్రశ్నలతో మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది.. అలా చాలా కరెక్ట్ పాయింట్స్‌ని లేవనెత్తారు. కొన్నిటికి తనూజ సమాధానం చెప్పినా, కరెక్ట్ పాయింట్‌కి మాత్రం ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ఇది ఆమెకు కొంతమేర నెగిటివ్ అయ్యే అవకాశం లేకపోలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

