Medak: ఎమ్మెల్యే రోహిత్ రావు తోడ్పాటుతో అభివృద్ధి
కేసీఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం
కాలనీని ఆదర్శవంతుంగా తీర్చిదిద్దుతాం
జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చౌదరి సుప్రభాత్ రావు
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్ (Medak) ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో పట్టణంలో కేసీఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాత్ రావు తెలిపారు. ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. గురువారం కాలనీలో కొత్త కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరుపేదలు నివాసముండే కేసీఆర్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ, కాలనీ శుభ్రతలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చోరీల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Also- Sanitation Workers: విధులు సక్రమంగా నిర్వహించని పారిశుద్ధ్య కార్మికులకు బ్యాడ్‌న్యూస్!
నూతన కార్యవర్గం ఎన్నిక
గురువారం కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు కూడా నిర్వహించారు. అధ్యక్షుడిగా డీజీ శ్రీనివాస శర్మ, గౌరవ అధ్యక్షుడిగా బాలమణి, ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం, కోశాధికారిగా దేవుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రోజి స్వామి, కుద్బోద్దిన్, నమండ్ల రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాదుల యాదగిరి, తుజాల శ్రీనివాస్ గౌడ్, చిర్ర సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ఊడెం దేవరాజు, పటేరి రాము, కర్రే నరేందర్, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య, బల్ల యాదగిరి, మెకొండ యాదగిరి, గూగుల రాజేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా యూత్ కమిటీలో దేవుని ప్రకాష్ అధ్యక్షుడిగా, అరుణ్, సాయి మణి, ఉన్న తేజ, దస్తగిరి, భానుచందర్ ఉపాధ్యక్షులుగా, సచిన్ సాగర్ ప్రధాన కార్యదర్శిగా, ఓంకార్ కోశాధికారిగా, రుతిక్, అప్రోజ్ ఖాన్, అజయ్, సాయి కృష్ణ, జీ. రాహుల్ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.
Read Also- Kalvakuntla Kavitha: గ్రూప్-1 నియామకాలపై కవిత సంచలనం.. సుప్రీంకోర్టు సీజేఐకి బహిరంగ లేఖ
మహిళ కమిటీలో బండి మంజుల అధ్యక్షురాలిగా, పుట్టి లక్ష్మి, కళావతి, కవిత ఉపాధ్యక్షులుగా, పుట్టి యాదగిరి ప్రధాన కార్యదర్శిగా, దిడ్డి సబిత కోశాధికారిగా, మర్కు సునీత సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జీ.శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కాలనీ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
