Journalists
మెదక్, లేటెస్ట్ న్యూస్

TUWJ: జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం.. టీయూడబ్ల్యూజే సభ్యుల కీలక వ్యాఖ్యలు

TUWJ: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్‌చారి

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టండి: రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి
ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస శర్మ

మెదక్ బ్యూరో, స్వేచ్చ: జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించే విధంగా టీయూడబ్ల్యూజే (TUWJ) తరఫున కృషి చేస్తున్నామని టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి అన్నారు. గురువారం స్థానిక ప్రగతి రిసార్ట్‌లో రామాయంపేట ప్రెస్‌క్లబ్ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించేందుకు రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా టీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని శంకర్ దయాల్ చారి  హామీ ఇచ్చారు. అనంతరం జర్నలిస్టుల సంక్షేమ కమిటీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ,అందుకు అనుగుణంగా ప్రెస్‌క్లబ్ బాధ్యులు పనిచేయాలని సూచించారు.హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజల కు ఆరోగ్య సమస్యలు ఉచితంగా తీర్చేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Read Also- Vrindavan Mystery: బృందావన్ టెంపుల్ మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోయారు? రాత్రి పూట ఆ భయంకరమైన అరుపులు ఎవరివి?

అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, టీయూడబ్ల్యూజే సంఘం రామయంపేట ప్రెస్ క్లబ్ తరఫున మండల పరిధిలో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నామన్నారు. రామయంపేట జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చిన తాను అందుబాటులో ఉంటానని జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందరం కలిసి ఒక్కటిగా ముందుకు వెళితే సమస్యల పరిష్కారం సులువు అవుతుందని జిల్లా కోశాధికారి వూడెం దేవరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, ఉపాధ్యక్షులు బొంతల సత్యనారాయణ, బల్ల యాదగిరి, కోశాధికారి తుజాల శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శి కర్రే నరేందర్, కార్యవర్గ సభ్యులు తుడుం పెంటయ్య, సార్గు నర్సింలు, రామచంద్ర రెడ్డి, సర్దార్ లు పాల్గొన్నారు.

Read Also- Success Story: సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి రూ.400 కోట్ల వ్యాపారవేత్తగా ఎదిగాడు.. ఏం చేస్తాడో తెలుసా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?