Vrindavan Mystery: బృందావన్ టెంపుల్ అనగానే మనకీ మిస్టరీలు గుర్తు వస్తాయి. ఎందుకంటే, ఈ టెంపుల్ మిస్టరీలను ఎవరూ కూడా ఛేదించలేకపోయారు. సాధారణంగా ప్రతి గుడిలో ఉదయం దేవుళ్ళకు నైవేద్యాలు పెడతారు. కానీ, ఇక్కడ మాత్రం సాయంత్రం కూడా పెడతారు. ఈ టెంపుల్లో ఉన్న దేవుడికి సాయంత్రం గుడి తలుపులు మూసే ముందు ప్రసాదాన్ని పెడతారు.
మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ ప్రసాదం సగం తినేసి ఉంటుంది. అయితే, ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఆ ప్రసాదాన్ని ఎలుకలు తినేసి ఉంటాయి కదా అని, ఎందుకంటే అవి ఏది తిన్నా ఫుల్ గా తినవు, మధ్యలోనే వదిలేస్తాయి. కానీ, ప్రతి రోజూ ఎలుకలు మొత్తం తినేయకుండా.. సగమే ఎలా తింటాయి?
అయితే, అక్కడున్న వారు ఏమని నమ్ముతారు అంటే, కృష్ణుడు ప్రతి రోజు గుడిలోకి గోపికలతో వచ్చి ఆడుకుని ప్రసాదం తినేసి వెళ్తాడని నమ్ముతారు. ఒక వ్యక్తి ఇది నిజమా ? కాదా అని తెలుసుకోవడానికి ఒక రోజు రాత్రంతా ఆ గుడిలోనే ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా గుడి లోపలే ఉన్నాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే.. ఆ మనిషి మెంటల్ గా అయిపోయాడు. అంటే అతను నార్మల్ గా లేడు, చాలా దారుణంగా మారిపోయాడు. అయితే, ఆ గుడిలో రాత్రి పూట భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు. ఆ అరుపులు సాక్షాత్తు శ్రీకృష్ణుడివని అంటున్నారు. అర్ధ రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకునేటప్పుడు అవి అరుపులు లాగా వినిపిస్తున్నాయని చెబుతున్నారు. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
