Farmers Land Dispute image credit: swetcha Reporter]
మెదక్

Farmers Land Dispute: నవాపేట్ భూ వివాదం.. రైతుల హక్కుల కోసం పోరాటం

 Farmers Land Dispute:  మెదక్ జిల్లా కేంద్రంలో నీ నవాపేట్ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు,20016 నుండి రెవెన్యూ యంత్రాగం నిలిపి వేసింది.మెదక్ పట్టణం లోని 1608 సర్వే నెంబర్ లోని,2.16 ఎకరాలకు సంబంధించి భూమి 2016లో రెవెన్యూ భూముల ప్రక్షాళన భాగంగా అప్పటి బీ అర్ యస్ ప్రభుత్వం దేవాలయ,భూములు,ఈనాం భూములు, వక్ఫూ భూములు తదితర భూముల వివరాలు సేకరించిన క్రమంలో వక్ఫూ గెజిట్ లో 1608 సర్వే నెంబర్ ప్రత్యక్షం కావడంతో నవాపేట్ రైతులకు శాపంగా మారింది.

దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.అప్పటి వరకు తర తరాలుగా అనుభవిస్తున్న, భూమి కి సంబంధించి క్రయ, విక్రయాలు ప్రభుత్వం నిలిపి వేసింది.1608 సర్వే నెంబర్ లో భవనాలు,సహితం నిర్మించుకున్నారు.1969,అంతకు ముందునుంచి తాత ముత్తాత లనుండి,వంశ పారంపర్యంగా వస్తున్న భూమి సర్వే నెంబర్ 1608 లో రైతులు,25,35, మంది,చిన్న,చితక,3 గంటల నుండి,5,6,8,15, 16 గుంటల భూమి ఉన్న రైతులు 15 మందికి పై గా ఉన్నారు.

 Also Read: Sama Rammohan on HCU:హెచ్‌సీయూ భూములపై ఫేక్ ప్రచారం.. డిలీట్ అవుతన్న ట్వీట్లు!

వీరందరికీ1969 లో( ఓ అర్ సి )రైట్ సర్టిఫికెట్స్ కలిగిన రైతుల కు సంబంధించిన భూమి వక్ఫూ బోర్డు ది గా గెజిట్ లో ఉండడంతో అప్పటి కలెక్టర్ సర్వే నిర్వహించి, రైతుల భూమిగా తేల్చారు.మున్సిపల్ పర్మిషన్ తో ఈ స్థలాల్లో ఇండ్లు కూడా నిర్మించుకున్నారు.కోర్టు తీర్పు సహితం రైతులకు అనుకూలంగా వచ్చినా,దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకుంటున్న చందంగా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.కోర్టు తీర్పు కాపీని తాసిల్దార్ లక్ష్మణ్ బాబుకు ఇచ్చినా చూద్దాం,చేద్దాం, అన్న చందంగా కాలయాపనచేస్తున్నారు.అప్పటి ప్రభుత్వం లో జరిగిన చిన్న పొరపాటును సరిదిద్దడం లేదని రైతులు,విప్లవ కుమార్,గొల్ల నర్సింలు,తదితర రైతులు మండి పడుతున్నారు.

1969..అంతకు ముందు నుంచే తాత ముత్తాత లు,కాస్తులో ఉన్న రుతు భూములను
గుంట రెండు గుంటల మంచి మొదలుకొని 16 నుంచి 25 గంటల వరకు ఉన్న చిన్నాచితక వ్యవసాయ రైతు కుటుంబాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.25, నుండి 35 కుటుంబాల కు సంబంధించి భూ పరిష్కారం లభించేనా…అని ఎదురు చూస్తూన్నారు.మెదక్ పట్టణం లోని 1608 సర్వే నెంబర్ లోని 2.16 ఎకరాల పట్టా భూమి,1969 లో( ఓ అర్ సి) రైట్స్ కలిగి న రైతులకు సంబంధించిన భూమి వక్ఫూ బోర్డు ది అంటూ కొందరు కోర్టు ను ఆశ్రయించి,క్రయ,విక్రయాలను,నిలిపి వేశారు.

ఈ భూములకు సంబంధించి, మున్సిపల్ లో పర్మిషన్ లు ఇవ్వకుండా ఆన్లైన్ లో వీటికి సంబంధించిన లావాదేవీలు అధికారులు నిలిపి వేశారు.హైకోర్టు కు వెళ్లి న రైతులకు కోర్టులో న్యాయం జరిగింది.రైతుల పక్షాన ,రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.హైకోర్టు తీర్పు కాపీని తాసిల్దార్ కు ఇచ్చిన,సదరు తహసిల్దార్ పట్టించుకోవడం లేదనీ.రైతులు ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు కాపీని తాసిల్దార్ కు ఇచ్చిన..చూద్దాం…చేద్దాం అంటూ,కాలయాపన చేస్తున్నారనీ రైతులు విప్లవ్ కుమార్,నర్సింలు తదితరులు ఆరోపిస్తున్నారు.

HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?

జిల్లాఅధికార యంత్రాంగం అప్పట్లో ఈ భూమికి సంబంధించిన వివరాలు సర్వే నిర్వహించి, రైతుల దే భూమి అని తేల్చినా వివరాలు సబ్మిట్ చేసినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది,,క్రయ విక్రయాలు నిలిపి వేయడంతో చిన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిజానికి మెదక్ జిల్లా కేంద్రంలో అక్షరాల 57 ఎకరాల భూమి వక్ఫూ బోర్డు కు సంబంధించి న విలువైన భూములు ఉన్నాయి.

అందులో కొందరు ఆక్రమించి బడా బాబులు కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించి, సొమ్ము చేసుకుంటున్నారు.మహా అంటే నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు.ఈ చిన్న సన్నకారు రైతుల భూములకు సంబంధించి మాత్రం క్రయ, విక్రయాలు భూముల్లో జరగకుండా చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు