Sama Rammohan on HCU: హెచ్ సీయూ భూముల అంశంపై నిజాలు బయటకు వస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ట్విట్లు డిలీట్ అవుతున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏఐ ఇమేజ్ ను పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని, కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పరువు పోతుందని తాజాగా ఆ పోస్టును డిలీట్ చేశారని వివరించారు.
Also read: HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?
ఇదే బాటలో బీఆర్ ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఉన్నారని చురకలు అంటించారు. వాస్తవాలు తెలుసుకోకుండా బాధ్యత గల లీడర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఏమిటని? ప్రశ్నించారు. హెచ్ సీయూపై తప్పుడు ప్రచారం, అవాస్తవాలను పోస్టులు చేస్తున్న వారిపై చట్ట పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియాల్లో పోస్టులు చేయొద్దని సూచించారు.