HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఏఐ సహాయంతో చేసిన ఈ వీడియోల వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై దృష్టిని సారించింది. వీటి వెనక ఎవరున్నా సరే కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్ మీడియాలో పలు వీడియోలు హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే.
అక్కడున్న చెట్లను నరకటం వల్ల జింకలు, నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని వీడియోలను పలువురు అప్ లోడ్ చేశారు. ఏఐ సహాయంతో రూపొందిన ఈ వీడియోలు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పారు.
Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు
కాగా, ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు ఈ దిశలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్, ధృవ్ రాఠీ తదితరులపై కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.