Hoti Basavaraj: సంగారెడ్డి జిల్లా కళాకారుడికి అరుదైన గౌరవం..!
Hoti Basavaraj (imagecredit:swetcha)
మెదక్

Hoti Basavaraj: సంగారెడ్డి జిల్లాలో ఓ కళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం..!

Hoti Basavaraj: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రానికి చెందిన హోతి బసవరాజు(Hoti Basavaraj) చెక్కిన అందమైన రాతి శిల్పాల(Stone sculpture)కు ప్రాణం పోసినట్లుగా చెక్కిన ఈ శిల్పాలకు జాతీయ గుర్తింపు లభించింది. బసవరాజుకు చిన్నతనం నుంచి శిల్పకళలపై మక్కువ ఉండటంతో ఆయన ఆ కళల వైపే పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా న్యాల్ కల్(Nyalakal) గ్రామానికి చెందిన బసవరాజు 19 జూన్ 1979లో జన్మించారు. బసవరాజు తండ్రి అడిగప్ప టీచర్ వృత్తిలో కొనసాగుతుండగా, ఆయన శిల్పకళపై దృష్టి సారించారు. తండ్రి ప్రోత్సాహంతో, తల్లి ఆప్యాయతతో చదువు ముందుకు సాగిస్తూనే శిల్పకళపై ప్రేమ పెంపొందించుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో శిల్పకళలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

డాక్టరేట్ బిరుదు

రాజు చెక్కిన రాతి శిల్పాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బసవరాజు చెక్కిన శిల్పాలకు జాతీయ(National) స్థాయిలో గుర్తింపు రావడంతో 98వ జాతీయ ఆర్ట్స్ దినోత్సవానికి ఆహ్వానం అందింది. శిల్పకళలు చెక్కడంలో నైపుణ్యత సాధించిన బసవరాజుకు డాక్టరేట్ బిరుదు కూడా లభించింది. డాక్టర్ బసవరాజు చెక్కిన శిల్పాలలో విధి శిల్పాలు, సామాజిక సందేశాలతో పాటు ప్రకృతి పరిరక్షణ, చెట్ల పెంపకం, పశుపక్షాదుల రక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా ఈ శిల్పాలు చెబుతుంటాయి.

Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రోమో ఎప్పుడో తెలుసా? అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..

అమ్మ ఒడిలో భూమాత

ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ(All India Fine Arts and Crafts Society) నిర్వహించే సొసైటీ భవనంలో ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు సుష్మా కపూర్ ఆర్ట్స్(Sushma Kapoor Arts), కన్సర్వేషన్ అధికారి చేత ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనలో శిల్పి డాక్టర్ బసవరాజు రూపొందించిన రెండు కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నాయి. అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవులుజంతువులుజలాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిపాదించేలా రూపొందించిన ఈ శిల్పాలు జాతీయ స్థాయిలో గుర్తింపును తెస్తాయని డాక్టర్ బసవరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Actress Indraja: పబ్లిక్‌లో వల్గర్‌గా డ్రస్‌లు వేసుకునే వాళ్లకు ఆ మాట అనే అర్హత లేదు.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు