Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రోమో ఎప్పుడో తెలుసా?
Ustaad Bhagat Singh (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రోమో ఎప్పుడో తెలుసా? అఫీషియల్ ప్రకటన వచ్చేసింది..

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ విషయంలో అడుగు ముందుకు పడింది. పవన్ కళ్యాణ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను డిసెంబర్ 9 సాయంత్రం 6.30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారి, అంచనాలను అమాంతం పెంచేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన కూడా ఈ పాట గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఈ పాటకు చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్టెప్స్‌తో ఇరగదీసినట్లుగా దేవిశ్రీ చెప్పుకొచ్చారు.

Also Read- Annagaru Vostaru: కలయ, గోలయ్య, జై బాలయ్య.. ‘అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ వచ్చేసింది

గబ్బర్ సింగ్ సక్సెస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బ్లాక్‌బస్టర్ విజయం తరువాత పవన్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు కేవలం అభిమానుల్లోనే కాదు, మాస్ ప్రేక్షకులు, సినీ పరిశ్రమలోనూ భారీగా ఉన్నాయి. హరీష్ శంకర్ ఈసారి కూడా పవన్ కళ్యాణ్‌ను పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు మొదటి సింగిల్ ప్రోమోతో ఈ మ్యూజికల్ ఫెస్ట్ మొదలుకాబోతోంది.

Also Read- Actress Indraja: పబ్లిక్‌లో వల్గర్‌గా డ్రస్‌లు వేసుకునే వాళ్లకు ఆ మాట అనే అర్హత లేదు.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో..

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నిర్మాతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులను, మాస్ ప్రేక్షకులను, యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్మాణ విలువలు, సాంకేతిక అంశాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ టేకింగ్ కలగలిపిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026, ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోతో, రిలీజ్‌కు ముందే సినిమాపై మరింత భారీ హైప్‌ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు