Annagaru Vostaru: స్టార్ హీరో కార్తి (Karthi), ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru). ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ఎనర్జిటిక్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘అలాపిక్కే ఉమ్మక్’ అంటూ వచ్చిన ఈ పాట శ్రోతలను, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) అందించిన ట్రెండీ ట్యూన్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. యంగ్ టాలెంటెడ్ పర్సన్ రాకేందు మౌళి (Rakendu Mouli) అందించిన క్యాచీ లిరిక్స్, అలాగే ఆయన గాత్రం ఈ పాటకు మరింత ఊపును తీసుకొచ్చాయి.
Also Read- New Guy In Town: సంచలనం రేపుతున్న ఎస్. థమన్ ట్వీట్.. టాలీవుడ్‌లో ఆ మిస్టీరియస్ ‘న్యూ ఫేస్’ ఎవరు?
కార్తి స్టెప్పులు కేక
‘అలాపిక్కే ఉమ్మక్’ పాట లిరికల్ వీడియోలో హీరో కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్‌తో అదరగొడుతూ ఆకట్టుకోవడం అభిమానులకు మరింత పండగలా మారింది. ఈ పాటలోని ‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ వంటి మాస్ పల్స్ ఉన్న పదాలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ట్యూన్, రాకేందు మౌళి సాహిత్యం, కార్తి స్టైలిష్ డ్యాన్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. కె.ఇ. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విభిన్నమైన యాక్షన్ కామెడీ కథాంశంతో దర్శకుడు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. గ్లామర్, నటనతో ఆకట్టుకునే కృతి శెట్టి (Krithi Shetty) ఈ సినిమాలో కార్తి సరసన హీరోయిన్‌గా నటించింది.
ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్.. అంచనాలు తారాస్థాయిలో
ఇటీవల పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన ‘అన్నగారు వస్తారు’ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన విషయం తెలిసిందే. ట్రైలర్ సినిమా యాక్షన్, కామెడీ టైమింగ్‌ను హైలైట్ చేయడంతో, థియేటర్లలోనూ ఇదే రెస్పాన్స్ రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు, కార్తి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్తి, కృతి శెట్టితో పాటు సీనియర్ నటులు సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పక్కా వినోదంతో కూడిన ఈ యాక్షన్ కామెడీ, డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో, ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

