New Guy In Town: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక ‘న్యూ ఫేస్’ రాకపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టార్ సంగీత దర్శకుడు ఎస్. థమన్ (Music Director S Thaman) చేసిన ఒకే ఒక్క ట్వీట్.. రాబోయే ఒక కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీగా క్యురియాసిటీని పెంచింది. ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులకు ఎప్పుడూ స్వాగతం పలికే తెలుగు సినిమా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఒక కొత్త తరం కథాంశంతో కూడిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించే బాధ్యతను స్టార్ కంపోజర్ ఎస్. థమన్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువ మంది కొత్తవారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ న్యూ ఏజ్ ప్రాజెక్ట్‌కు థమన్ సంగీతం అందిస్తున్న నేపథ్యంలో, ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా సినిమా అభిమానుల్లో ఎక్సయిట్‌మెంట్ రేకెత్తించారు. ఇటీవల ఆయన #NewGuyInTown అనే హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
అతని రాక సౌండ్ చేస్తుంది
ఆ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు థమన్.. ‘అతను పెద్దగా మాట్లాడడు. కానీ అతని రాక సౌండ్ చేస్తుంది’ అనే శక్తివంతమైన టీజర్ లైన్‌ను జోడించారు. ఈ మిస్టీరియస్ లైన్.. పరిశ్రమలో ఒక బలమైన కొత్త నటుడి రాకను, అతని పాత్రకున్న ప్రాధాన్యతను సూచిస్తున్నట్టు సినీ వర్గాలు భావిస్తున్నాయి. థమన్ వంటి స్టార్ కంపోజర్ స్వయంగా.. ఇంతటి ఇంటెన్స్ టీజర్‌ను ఇవ్వడంతో, ఈ ‘న్యూ గై’ ఎవరై ఉంటారనే చర్చ సినీ వర్గాల్లో ఊపందుకుంది. ఇది కేవలం ఒక కొత్త నటుడి అరంగేట్రమేనా లేక ఇంతకాలం తెర వెనుక ఉండి ఇప్పుడు వెలుగులోకి రాబోతున్న గొప్ప సాంకేతిక నిపుణుడా? అనే కోణంలోనూ అభిమానులు చర్చించుకుంటున్నారు. నిర్మాణ సంస్థ అందించిన వివరాల ప్రకారం, ఇది పూర్తిగా కొత్త తారాగణం, సిబ్బందితో రూపొందుతున్న ఒక న్యూ ఏజ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ముఖ్యంగా.. ఈ చిత్రం ప్రేమ, యాక్షన్ నేపథ్యంతో కూడిన ఆకట్టుకునే కథనంతో రూపొందుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. థమన్ సంగీతం ఈ కథకు బ్యాక్‌బోన్‌గా నిలవనుంది.
Also Read- Bigg Boss Elimination: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?
టైటిల్, గ్లింప్స్ రివీలయ్యేది ఎప్పుడంటే?
ఈ న్యూ ఫేస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి అని, అతని తొలి ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని సూచనలు అందుతున్నాయి. ప్రస్తుతం, ఫిల్మ్ నగర్ అంతా ఈ మిస్టీరియస్ కొత్త వ్యక్తి ఎవరు అనే ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెర దించుతూ, చిత్ర బృందం త్వరలో తారాగణం, ఇతర సిబ్బంది వివరాలను రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా, సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్, గ్లింప్స్‌ను డిసెంబర్ 14న విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్ ఈ ‘న్యూ గై ఇన్ టౌన్’ ఎవరు? అనే రహస్యాన్ని తెలియజేస్తుందా? లేదా మరింత క్యురియాసిటీని పెంచుతుందా? అనేది చూడాలి. థమన్ ట్వీట్ పుట్టించిన ఈ అంచనాలు, రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్‌ను తీసుకురావడం ఖాయమని చెప్పొచ్చు.
#NewGuyInTown 🔥🔥🔥💣💣📈🙌🏿 !! pic.twitter.com/EaMvNHrH1r
— thaman S (@MusicThaman) December 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

