Sangareddy News: నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసి కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ శెట్కార్(MP Suresh Shetkar), TGIIC చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellayya Nayak) ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అధితుల చేతుల మీదుగా వారికి ప్రశాంస పత్రాలు అందజేశారు.
ప్రజల కోరిక మేరకు..
ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండా గా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. శిక్షణా కార్యక్రమం లో ప్రతీ ఒక్కరూ సిన్సియర్ గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు. ఇలాంటి క్యాంపు సంగారెడ్డిలో జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Allu Arjun: బన్నీకి చేదు అనుభవం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. భార్యతో వచ్చి ఉక్కిరిబిక్కిరి!
ఉపాధి హామీ పధకం
కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి దన్నారు. దేశ స్వాతత్ర్యం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మ ను తొలిగించాలని కుట్ర చేస్తున్నారని అందరం ఏకం అయ్యి అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు మాటలతో సరిపెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలా కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తీరుతుంద ని వివరించారు. అదివాసీ శిక్షణలో జరిగిన చర్చలు, విషయాలను బయట చెర్చించాలని కోరారు. అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పధకం నుండి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. గరిబోళ్లకు ఉపాధి కల్పించకుండా, గరిబోళ్లను పెంచే విదంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.
Also Read: Alcohol to Dog: కుక్కతో బలవంతంగా మద్యం తాగించిన వ్యక్తి … చివరికి ఏం జరిగిందంటే?

